జేడీకీ మూడు మార్గాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-31 16:20:57

జేడీకీ మూడు మార్గాలు

మాజీ సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అంటే అప్ప‌ట్లో ఓ సెన్సేష‌న్ , జ‌గ‌న్ కేసులు డీల్ చేసి నిజాలు నిగ్గు తేల్చుతారు అని అంద‌రూ భావించారు... అయితే త‌ర్వాత ఆ ప్ర‌శంస‌లపై అనేక అనుమానాలు అనేక కామెంట్లు రావ‌డంతో, గ‌తంలో జ‌గ‌న్ పై అక్ర‌మంగా కేసులు బ‌నాయించారు అని తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో తెలుస్తోంది.
 
ఇటు సీబీఐ జేడీ త‌న ఐపీఎస్ ప‌ద‌వికి రాజీనామా చేసి వీర్ ఎస్ తీసుకుని, మ‌హారాష్ట్ర కేడ‌ర్ నుంచి ఏపీకి వ‌చ్చారు.. అయితే ఇక్క‌డ ప‌రిస్దితిలో మార్పు రావాలి, రాజ‌కీయంగా కొత్త ఒర‌వ‌డిని తీసుకువ‌స్తా అంటున్నారు సీబీఐ మాజీజేడీ, ఇక ఇప్ప‌టికే గుంటూరు ఉత్త‌రాంధ్రా ప్రాంతాల ప‌ర్య‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్లో తిరుగుతున్నారు...వ్య‌వ‌సాయ దారులు రైతుల‌కు సాయం చేయాలి అని తెలియ‌చేస్తున్నారు... త‌న మ‌న‌సులో భావాల‌ను వ్య‌క్త‌ప‌రుస్తూ రాజ‌కీయనాయ‌కుడిగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.
 
అయితే ఆయ‌న తెలుగుదేశం పార్టీలో చేరే అవ‌కాశం ఉంద‌ని, ఇటు జ‌న‌సేన పార్టీలో చేరే ఆస్కారం ఉందని, ప‌వ‌న్ తో మంత‌నాలు జ‌రిపారు అని వార్త‌లు వినిపించాయి... అయితే అవ‌న్నీ ఒట్టి రూమ‌ర్లు అని తేలిపోయాయి... అలాగే   పొలిటిక‌ల్ గా  కాంగ్రెస్ కు ఏపీలో ఉనికి లేదు... అందుకే ఏపీ కాంగ్రెస్ బాధ్య‌త‌లు తీసుకుంటారు అని కూడా వార్త‌లు వ‌చ్చాయి... ఇది కూడా ఒట్టి జంక్ రూమ‌ర్ అని తేలిపొయింది... ఇది పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో జ‌రుగుతున్న చ‌ర్చ‌.
 
ఇక మాజీ సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పై ఇప్పుడు పెద్ద ఎత్తున జ‌రుగుతున్న పొలిటిక‌ల్ ప్ర‌చారం.. ఆయ‌న బీజేపీలో చేరే అవ‌కాశం ఉంది అని అంటున్నారు...  దీనికి ముఖ్య కార‌ణం కూడా ఉంది... ఆయ‌న బీజేపీలో చేరేందుకు ఇప్ప‌టికే నాయ‌కుల‌తో మంత‌నాలు జ‌రిపార‌ని, ఏపీ బీజేపీలో ఆయ‌న సామాజిక వ‌ర్గాన్ని త‌మ‌వైపు తిప్పుకునేందుకు బీజేపీ ఆలోచిస్తోంది అని తెలుస్తోంది.
 
అయితే ఇప్పుడు వినిపిస్తున్న ఈ అంశం పై టీడీపీ కౌంట‌ర్లు కూడా మొద‌లుపెట్టింది... ఒక‌వేళ ఆయ‌న బీజేపీలోకి వెళితే , జ‌గ‌న్ కూడా బీజేపీకి ద‌గ్గ‌ర అవుతున్నఈ స‌మ‌యంలో బీజేపీ ఏపీలో పొలిటిక‌ల్ డ్రామాల‌కు తెర‌లేపుతోంది అంటున్నారు.
 
ఆయ‌న ఈ స‌మ‌యంలో బీజేపీలో చేరే ఆస్కారం 80 శాతం లేదు అని విశ్లేష‌కులు చెబుతున్నారు... ఆయ‌న వైసీపీకి స‌పోర్ట్ చేసిన‌ట్లే అని ఈ కూట‌మిలో భాగంగా ఆయ‌న థ‌ర్ట్ ప్రంట్ కు సాయం చేస్తారు అని, కొత్త పార్టీ పెట్టి స‌పోర్ట్ గా నిలుస్తారు అని, ప్రాంతీయపార్టీల హవాలో ఎదుగుతారు అని కొంద‌రి ఆశ‌. ....మ‌రి బీజేపీ ఒక‌వేళ ఆయ‌నకు మంచి ఆఫ‌ర్ ఇచ్చి పార్టీ త‌ర‌పున తీసుకుంటే, నిజంగా ఇది ఓ సెన్సేష‌న్ అనే చెప్పాలి. మ‌రి ఆయ‌న నేష‌న‌ల్ పార్టీల్లో చేర‌తారా లేక ప్రాంతీయ‌పార్టీకి స‌పోర్ట్ ఇస్తారా,  లేదా కొత్త పార్టీ పెట్టి సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తారా అనేది వెయిట్ అండ్ సీ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.