రాజ‌కీయాల్లో ఎంట్రీ పై స్పందించిన జేడీ లక్ష్మీనారాయణ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jedi lakshinarayana image
Updated:  2018-03-31 12:14:53

రాజ‌కీయాల్లో ఎంట్రీ పై స్పందించిన జేడీ లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ  రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారు అంటూ గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి... ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఇప్పుడు ఇదే పెద్ద హాట్ పొలిటిక‌ల్ టాపిక్ అయింది ఏపీ -తెలంగాణ‌లో... అయితే ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావాలి అని 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలోనే అనుకున్నార‌ట, ఈవిష‌యాన్ని ఓ ఆస్దాన ప‌త్రిక ఇటీవ‌ల రివీల్ చేసింది.
 
అయితే ఆయ‌న వైసీపీలో చేర‌రు అనేది నూటికి 200 శాతం క‌రెక్ట్,  కాని మొద‌ట్లో ఆయ‌న తెలుగుదేశంలో చేరే అవ‌కాశం ఉంది అని వార్త‌లు వినిపించాయి.. ఆయ‌న గ‌తంలోనే తెలుగుదేశంలో చేరుతారు అని అనుకున్నారట తెలుగుదేశం నేత‌లు... కాని ఆయ‌న వేరే రాష్ట్రంలో పోస్టింగ్ రావ‌డంతో వెళ్లిపోయారు.. ఇప్పుడు ఏపీలో జ‌న‌సేన దూకుడుగా ఉంది, ఆయ‌న జ‌న‌సేన‌లో చేర‌డానికి రెడీగా ఉన్నారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి....ఇక ప‌వ‌న్ ప్లీన‌రీకి ముందు ఆయ‌న ప‌వ‌న్ కు విష్ చేస్తూ మెసేజ్ చేశారు అని కూడా తెలియ‌చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్... దీంతో ఆయ‌న రాజ‌కీయాల్లో జ‌న‌సేన ద్వారా ఎంట్రీ ఇస్తారు అని అనుకుంటున్నారు.
 
అయితే ఈ వార్త‌ల‌పై సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ స్పందించారు..తనపై వస్తున్న వార్తలన్నీ మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నది వాస్తవమేనన్నారు. అయితే ఆ దరఖాస్తు మహారాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని చెప్పారు..ప్రభుత్వ ఆమోదించాక భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని జేడీ లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు.. నాయ‌కులు అయ్యే ముందు అంద‌రూ చెప్పేది ఇదే ...అదే విధంగా ల‌క్ష్మీనారాయ‌ణ చెప్పారు... ప్ర‌భుత్వం ఆయ‌న రాజీనామాని ఇంకా ఆమోదించ‌క ముందే భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ఎందుకు ప్ర‌క‌టించ‌డం అని ఆయ‌న వేచి చూస్తున్నారు అనేది స్ప‌ష్టం అయింది.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.