జేఎఫ్ సీ గూటిలో జ‌గ‌న్ అనుచ‌రుడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-18 10:58:40

జేఎఫ్ సీ గూటిలో జ‌గ‌న్ అనుచ‌రుడు

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు..... శాశ్వ‌త శత్రువులు ఉండ‌ర‌నే  సామెత‌కు మ‌రో నిద‌ర్శ‌నం ఈ వార్త‌. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బడ్జెట్ లో ఏపీకి జ‌రిగిన అన్యాయంతో కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి  ఇచ్చిన నిధుల‌పై నిజ నిర్ధార‌ణకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ ఇప్పుడు హాట్ టాపిగా సాగుతోంది. 
 
ఈ క‌మిటీలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్, లోక్ స‌త్తా వ్య‌వ‌స్ధాప‌కులు జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ‌, మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు, ల‌సాని శ్రీనివాస్ వంటి అనేక‌మంది మేధావులు ఉన్నారు. వీరితో పాటుగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అనుచ‌రుడు కూడా ఇందులో చేర‌డం గ‌మ‌నార్హం. 
 
గ‌త ఎన్నిక‌ల్లో ఏలూరు  పార్ల‌మెంట్  స్ధానంలో వైసీపీ అభ్య‌ర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్ర‌శేఖ‌ర్ కూడా ఈ క‌మిటిలో జాయిన్  అవ‌డం గ‌మనార్హం. చంద్ర‌శేఖ‌ర్ ను ప్ర‌త్యేకంగా ప‌వ‌న్ పిలిచి మ‌రీ జేఎఫ్ సీలో స్ధానం క‌ల్పిండంపై ప్ర‌స్తుతం చ‌ర్చ కొన‌సాగుతోంది.
 
చంద్ర‌శేఖర్ గ‌తంలో  ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌పున గుంటూరు నుండి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీల‌కు ఎలాంటి సంబంధం లేకుండా ఈ క‌మిటీ ఏర్పాటు చేశారు.  ఇక జేఎఫ్ సీ కోరిక మేర‌కు కేంద్రం నుండి రాష్ట్రానికి వ‌చ్చిన నిధుల‌పై ఏపీ స‌ర్కార్ నివేదిక‌ను అంద‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నివేదిక ప‌రిశీల‌న అనంత‌రం జేఎఫ్ సీ త‌దుపరి కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టించ‌నుంది. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.