బాబుకు చుక్కలు చూపించిన జర్నలిస్టులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu delhi parliament
Updated:  2018-04-03 06:29:29

బాబుకు చుక్కలు చూపించిన జర్నలిస్టులు

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు గాంధీ విగ్రహం దగ్గర, పార్లమెంటు మెట్లు దగ్గర బాబు విచిత్రమైన ఫీట్లు చేయడం, అవి సోషల్ మీడియాలో వైరల్ అవడం మనం చూసాం...ఢిల్లీపైన పటపట కోరుకుదాం అని వెళ్లిన బాబు మొదటి రోజంతా ఫీట్లకే సరిపోయింది..... రెండో రోజైన కొరుకుతాడో లేడు చూడాలి అని సోషల్ మీడియా కోడై కూస్తుంది.
 
కొద్ది సేపటికే సభ వాయిదా పడటంతో కొన్ని పార్టీల అగ్రనేతలతో కరచాలనం చేసారు బాబు...ఆ తర్వాత మీడియాతో మాట్లాడే ప్రయ‌త్నం చేసిన బాబుకు విలేఖ‌రులు షాక్ ఇచ్చారు.
 
సార్‌.. ఏపీకి అన్యాయం జరుగుతుంటే నాలుగేళ్లు బీజేపీతో మిత్రపక్షంగా ఎందుకు ఉన్నారు....
కేంద్రానికి రెవెన్యూలోటు భర్తీ నిధుల లెక్కలు ఎందుకు చూపడంలేదు?
అర్థరాత్రి మీటింగ్ ప్ర‌తీ ప్యాకేజీకి జైకొట్టిన మీరు ప్రత్యేక హోదా అంటూ ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు?
ప్రతిపక్షం యూ టర్న్ బాబు అంటుంది దీనిపైనా మీ స్పందన ఏంటి? 
ప్రత్యేక హోదా ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టే ఎన్నికల కోసం యూ టర్న్ తీసుకోని ఎన్డీఏ నుంచి బయటికొచ్చి, ప్రత్యేక హోదా అంటున్నారా? అంటూ బాబుకు విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించడంతో ఏం మాట్లాడాలో తెలియక వాట్‌ ఐయామ్‌ సేయింగ్‌ ఈజ్‌ అని నెమరు వేసుకున్నారు...చివరకు బీజేపీ ఏపీకి న్యాయం చేస్తుందని నాలుగేళ్లు వెయిట్ చేసాం...వారు నిలువునా మమ్మ‌ల్ని నట్టేట ముంచడంతో ఢిల్లీపైన పోరాటానికి సిద్ధమయ్యామని చెప్పారు బాబు.
 
లోకుల మాట :
ఎవరైనా మోసం చేస్తుంటే ఒక సంవత్సరం, రెండేళ్లు, మూడేళ్లు చూస్తారు కానీ మన బాబుగారేమో రాష్ట్రం ఏమయిపోయినా పర్వాలేదు... ఓటుకు నోటు, 18 కేసుల స్టేల కోసం ఎన్నేళ్లైనా ఎదురుచూస్తారు అంటున్నారు ప్రజలు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.