క‌న్నీరు మున్నీర‌వుతున్న ఎన్టీఆర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jr ntr
Updated:  2018-08-29 12:16:38

క‌న్నీరు మున్నీర‌వుతున్న ఎన్టీఆర్

నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణవార్త విన‌గానే ఆయ‌న కుమారుడు హీరో ఎన్టీఆర్ క‌న్నీరు మున్నీరు అయ్యారు. ఈ రోజు తెల్ల‌వారు జామున హ‌రికృష్ణ హైద‌రాబాద్ లోని త‌న నివాసం నుంచి 4 గంట‌లా 30 నిమిషాల‌కు నెల్లూరు జిల్లాలోని కావ‌లికి బ‌య‌ల్దేరారు. ఆయ‌న బ‌య‌ల్దేరిన గంట స‌మ‌యానికే ఘోర ప్ర‌మాదానికి గురి అయిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక ఆయ‌న మ‌ర‌ణవార్త తెలుసుకున్న‌ ఇద్ద‌రు కుమారులు ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ హుటా హుటీన ఆసుప‌త్రికి చేరుకున్నారు. అయితే ఆన‌ను ఆసుప‌త్రికి తీసుకువ‌చ్చిన వెంట‌నే ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో ఆయ‌కు మెరుగైన వైద్యంను అందించి హ‌రికృష్ణ ప్రాణాల‌ను కాపాడేందుకు అన్ని విధాలుగా ప్ర‌య‌త్నించినా ఫ‌లితం ద‌క్క‌లేదు.
 
దీంతో ఆయ‌న మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక ఆక్క‌డే ఉన్న ఎన్టీఆర్ ఈ దుర్వార్త‌ను విన‌గానే క‌న్నీటి సంద్రంలో మునిగిపోయారు. క‌ళ్ల‌ముందే చెట్టంత నాన్న‌ మృత‌దేహాన్ని చూసి కుమారులు ఇద్ద‌రు బోరున విల‌పించారు.

 

షేర్ :