రంగంలోకి జూనియ‌ర్ ఎన్టీఆర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-06 11:08:58

రంగంలోకి జూనియ‌ర్ ఎన్టీఆర్

లక్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి క‌ర్త‌వ్యం నుంచి, ఏపీ మంత్రి నారా లోకేశ్ దావోస్ నుంచి అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు.. తెలుగు  నాయ‌కుల‌కు ఆయ‌న ప‌ర్య‌ట‌న‌తో జోష్ తెప్పిస్తున్నారు లోకేశ్..  అలాగే అమెరికాలో న్యూజెర్సిలో మంత్రి లోకేశ్ ఎన్నారై టీడీపీ స‌మావేశంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.. ఈ స‌మ‌యంలో కార్య‌క‌ర్త‌ల ఉత్సాహం చూస్తుంటే?  అమెరికాలో కూడా తెలుగుదేశం అధికారంలోకి వ‌స్తుంది అని కామెంట్లు  చేశారు, ఈ వార్త‌లు వైర‌ల్ అయ్యాయి మీడియాలో...అదే ఉత్సాహంతో ఎన్నారై స‌మావేశాలు జ‌రుగుతున్నాయి అగ్ర‌రాజ్యంలో.
 
సొంత గ‌డ్డ పై ఓన్ ఇమేజ్... బ్రాండ్ ఏర్ప‌ర‌చుకుంటున్న మంత్రి లోకేశ్ కు.. తాజాగా అక్క‌డ ఓ సందిగ్ద‌త ప్ర‌శ్న ఎదురైంది...అట్లాంటాలో ఆయ‌న పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆహ్వ‌నించారు ఎన్నారైల‌ను... పెట్టుబడులు గురించి తెలిసిందే క‌దా? ఎప్పుడూ ఇదేనా?  రాజ‌కీయం మాట్లాడ‌దామ‌ని అన్నార‌ట మంత్రి లోకేశ్ తో.
 
అలాగే ఏపీలో అధికారంలో ఉన్నారు.. మ‌రి తెలంగాణ ప‌రిస్ధితి ఏమిటి? అని ప్ర‌శ్నించారు అక్క‌డ అభిమానులు.. సో ఇక్క‌డ ఆయ‌న ఎటువంటి  మాటా మాట్లాడ‌లేదు.. అలాగే వెంట‌నే తెలంగాణ‌లో పార్టీని బ్ర‌తికించుకోవాలి అని అన్నారు ఎన్నారైలు, ఇక లోకేశ్ త‌న విధానంలో స‌మాధానం చెప్పినా అక్క‌డ కేడ‌ర్ గురించి ప్ర‌శ్నించారు స‌భ్యులు.
 
దీంతో ఆయ‌న స‌మాధానం చెప్ప‌లేక‌పోయారు.. అయితే తెలంగాణ‌లో పార్టీ పుంజుకోవాలి అంటే, జూనియ‌ర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాలి అని కొంద‌రు సూచించారు.. దీంతో మంత్రి లోకేష్ ఏమి మాట్లాడాలో తెలియ‌క స‌మాధానం చెప్ప‌లేక పార్టీ జాతీయ అధ్య‌క్షుడు సీఎం చంద్ర‌బాబు కు త‌ప్ప‌క తెలియ‌చేస్తాను అని అన్నారు,
 
 కాస్త ముందుకు అడుగు వేసి తెలంగాణ తెలుగుదేశం పార్టీ చీఫ్ గా జూనియ‌ర్ ఎన్టీఆర్ ను నియ‌మించాలి అని కోరారు ఎన్నారైలు.. అయితే దీనికి ఎన్టీఆర్ ముందుకు వ‌స్తారా లేదా అనేది చెప్ప‌లేం.. ఎలాగో వ‌చ్చే రోజుల్లో జ‌రిగేది అదే అంటున్నారు నాయ‌కులు తెలుగు త‌మ్ముళ్లు.రంగంలోకి జూనియ‌ర్ ఎన్టీఆర్  వస్తే ఇక డైల‌మాలో లోకేష్ ఉంటారు అని గుస‌గుస‌లాడుకుంటున్నారు సైకిల్ ఫాలోవ‌ర్స్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.