రాష్ట్రంలో సంచ‌ల‌నం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp and tdp war
Updated:  2018-05-30 05:44:12

రాష్ట్రంలో సంచ‌ల‌నం

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ప్ర‌త్యేక హోదా ఏపీకి ప్ర‌క‌టించాల‌ని కోరుతూ నాలుగు సంవ‌త్స‌రాల నుంచి త‌న‌కున్న స్ట్రెంథ్ తో పోరాడుతునే ఉన్నారు. వాస్త‌వంగా చెప్పాలంటే ఈ పోరాటం అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేయాలి. కాని వారు సైలెంట్ కావ‌డంతో అధికార భాద్య‌త‌ల‌ను తీసుకుని నిత్యం కేంద్రంతో పోరాడుతూనే ఉన్నారు జ‌గ‌న్. 
 
అయితే ఇదే క్రమంలో త‌న ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా అమ‌రావ‌తిలో నిరాహార దీక్ష చేశారు జ‌గ‌న్. అయితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎక్క‌డ రాష్ట్ర ప్ర‌జ‌లు త‌న పార్టీకి దూరం అవుతారోన‌ని గ్ర‌హించి దీక్ష‌చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అధికార బ‌లంతో రాష్ట్రానికి ప్ర‌ధాని మోడీ వ‌స్తున్నార‌ని చెప్పి ఈ దీక్ష‌ను భ‌గ్నం చేయించిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక ఈ క్ర‌మంలో పార్ల‌మెంట్ స‌మావేశాలు వ‌చ్చాయి. ఈ స‌మావేశంలో వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాష్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డిలతో జ‌గ‌న్ పార్ల‌మెంట్ లో ప్ర‌త్యేక హోదా సెగ‌ల‌ను తెప్పించారు. ఈ సెగ‌తో పార్ల‌మెంట్ స‌మావేశాలు పూర్తి అయ్యేంత వ‌ర‌కు యావ‌త్ దేశ ప్ర‌జ‌లంతా వైసీపీ ఎంపీల వైపు చూస్తూ ఉండిపోయారు. నెక్ట్స్ ఏం చేయ‌బోతున్నారు అన్న సందేహంతో  ప్ర‌జ‌లంతా టీవీల‌కు అతుక్కుపోయారు. 
 
ఇక పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు వైసీపీ ఎంపీలు పార్ల‌మెంట్ చివ‌రి స‌మావేశం రోజున త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి స్పీక‌ర్ సుమిత్ర మ‌హాజ‌న్ కు అంద‌జేశారు. ఆ త‌ర్వాత ఏపీ భ‌వ‌న్ లో సుమారు వారం రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక వారి రాజీనామాలపై  స్పీక‌ర్ చ‌ర్చించారు.భార‌త రాజ్యాంగం ప్ర‌కారం వారు ఎందుకు రాజీనామా చేయాల‌నుకున్నారో అన్న‌విష‌యం పై స్పీక‌ర్ చ‌ర్చించాలి. ఆ త‌ర్వాత వారు చెప్పిన వివ‌రాల‌కు స్పీక‌ర్ సంతృప్తి చెందితే అప్పుడు వైసీపీ ఎంపీల రాజీనామాల‌ను ఆమోదిస్తారు. ఇక ఈ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే స్పీక‌ర్ వైసీపీ ఎంపీల‌తో సుమారు 40 నిమిషాల పాటు చ‌ర్చించారు. ఆ త‌ర్వాత స్పీక‌ర్ వారితో ప్ర‌త్యేక హోదా బావోద్వేగంతో త‌మ ప‌ద‌వులకు రాజీనామా చేశార‌ని పేర్కొన్నారు.
 
అందుకే వారి రాజీనామాలపై మ‌రోసారి ఆలోచించుకోవలసినదిగా స్పీక‌ర్ ఇంకొంత సమయాన్ని కేటాయించారు. ప్రజా ప్రతిధులు అన్న తరువాత ప్రజలకు బద్ధులై ఉంటే సరిపోదు, బాధ్యత కలిగి ఉండాలి అని చెప్పారు. రాజీనామాలకు సంబంధించి సరైన కారణం కోసం వైసీపీ ఎంపీలకు జూన్ 5, 7 వ తేదీలలో మళ్ళీ వారితో సమావేశమవుతానని చెప్పారు. అయితే అప్పటికీ వారు రాజీనామాలకు కట్టుబడి ఉంటే అప్పుడు ఆమోదిస్తానని స్పీక‌ర్ స్ప‌ష్టం చేశారు. స్పీక‌ర్ వైసీపీ ఎంపీల రాజీనామాల‌ను ఆమోదించిన త‌ర్వాత ఏపీలో మ‌రోసారి వార్ జ‌రుగ‌నుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు తెలుపుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.