ప్రతి పక్షనేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు.. ఈ యాత్ర తెలుగు దేశం పార్టీ నాయకుల కంచుకోట అయినటువంటి గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో నిర్విరామంగా కొనసాగుతోంది... ప్రజల సమస్యలను తెలుసుకుంటూ నవరత్నాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు జగన్... అంతేకాదు వారికి చేదోడు వాదోడుగా నిలుస్తానని భరోసా ఇస్తున్నారు..
ఈ సంకల్ప యాత్రలో భాగంగా నేడు తూర్పు గోదావరి జిల్లా జగ్గం పేటకు చేందిన ఓ కీలక టీడీపీ నాయకుడు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు... గతంలో ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచి తర్వాత పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే... అయితే టీడీపీ పార్టీ చేస్తున్న అవినీతి అరాచకాలను సహించలేకే తిరిగి తాను మళ్లీ వైసీపీలోకి చేరానని జ్యోతుల చంటిబాబు అన్నారు...
ఈ సందర్భంగా జగన్ సమక్షంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అవలంభించిన వైఖరి, టీడీపీలో తనకు ప్రాధాన్యత లేదన్న భావంతో ఆ పార్టీకి రాజీనామా చేశానని చంటిబాబు అన్నారు...అందులో భాగంగానే తన మద్దతు దారుల నిర్ణయంమేరకే వైయస్సార్ కాంగ్రేస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు... అంతేకాదు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు... ఈ ఎన్నికల కోసం తాను నిరంతరం పార్టీ శ్రేయస్సు కోసం పాటు పడుతూనే ఉంటానని అన్నారు జ్యోతుల.
అందులో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఇది ఆరంభం మాత్రమే ఇంకొద్దిరోజులు ఆగితే వైసీపీలోకి వలసలు రావడం ఖాయం అని తెలిపారు... ముఖ్యమంత్రి అధికారం అండచూసుకుని అక్రమంగా అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, ఇదంతా ప్రతీ ఒక్కరు గమనిస్తున్నారని అన్నారు... వచ్చే ఎన్నిల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని జగన్ స్పష్టం చేశారు.
Comments