వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-23 18:56:18

వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని ఇత‌ర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఒక‌ప్పుడు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున అత్య‌ధిక మోజార్టీతో గెలిచి టీడీపీ నాయ‌కులు ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో సుమారు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం తీసుకున్న‌సంగ‌తి తెలిసిందే. 
 
అయితే ఇదే విష‌యంపై గ‌తంలో ప్ర‌తిపక్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పందించారు. త‌మ ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు నాయుడు సంత‌లో గొర్రెల‌ను కొన్న‌ట్లు కొన్నార‌ని మీడియా స‌మ‌క్షంలో అనేక సార్లు జ‌గ‌న్ ఆరోపించారు. అయితే ఈ క్ర‌మంలో ఫిరాయింపు కొనుగోలుపై అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు కూడా ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.
 
అయితే స్పీక‌ర్ వారి ఫిర్యాదుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో దేశంలో ఏ ప్ర‌తిప‌క్ష‌నాయ‌కులు చేయ‌లేని విధంగా జ‌గ‌న్ చేశారు. ప్ర‌తిప‌క్షంలో ఉండి ఒక్క‌సారి కూడా అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కాలేదు. దీంతో జ‌గ‌న్ దేశ వ్యాప్తంగా మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇదే క్ర‌మంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు చెక్ పెట్టెందుకు జ‌గ‌న్ అనేక వ్యూహ‌లు ర‌చించిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా జ‌గ‌న్ త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి టీడీపీ నాయ‌కులు వ‌రుస‌గా జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు. అయితే వారిని చంద్ర‌బాబు ఆప‌డానికి శ‌తవిధాలా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ వైసీపీలోకి వ‌ల‌స‌లు మాత్రం ఆగ‌డం లేదు. ఇక చివ‌రికి చేసేది ఏమీ లేక చంద్ర‌బాబు టీడీపీ నాయ‌కులను బుజ్జ‌గించే కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌ని తాజాగా విశ్లేష‌కులు తెలుపుతున్నారు.
 
అయితే ఈ క్ర‌మంలో ఫిరాయింపు ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు, జ్యోతుల నెహ్రూ ఆయ‌న కుమారుడు తిరిగి వైసీపీలోకి చేరేందుకు ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. జ్యోతుల నెహ్రూ  వైఎస్ కుటుంబానికి ఎంతో స‌న్నిత సంబంధం వుంది. ఈ సంబ‌ధంతోనే 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున జ‌గ‌న్ సీటు ఇచ్చారు. కానీ ఆయ‌న జ‌గ‌న్ న‌మ్మ‌కాన్ని వ‌మ్ముచేసి, ప‌దువుల‌కు ఆసించి చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం  తీసుకున్నారు. టీడీపీ తీర్థం అయితే తీసుకున్నారు కానీ జ్యోతుల నెహ్రూ చెప్పిన ఆఫ‌ర్స్ ను మాత్రం చంద్ర‌బాబు ఇంత వ‌ర‌కూ నెర‌వేర్చ‌లేద‌ని, దీంతో తిరిగి మ‌ళ్లీ వైసీపీ లోకి చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నార‌నే టాక్ ప్ర‌స్తుతం గోదావరి ప్ర‌జ‌ల్లో  వినిపిస్తున్న మాట‌. 
 
అయితే ఈ విష‌యం జ్యోతుల నెహ్రూకు తెలిసినా కూడా ఏ మాత్రం స్పందించ‌లేదు. ఇక ఆయ‌న స్పందించ‌క పోవ‌డంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఎంతో ఆగ్రహం తెచ్చింద‌ట‌. దీంతో ఆయ‌న నెహ్రూ స్వగ్రామం అయిన ఇర్రిపాక నివాసంలో ఐటీ శాఖాధికారుల‌తో  సోదాలు చేయించార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.
 
ఇక ఈ సోదాల త‌ర్వాత  జ్యోతుల నెహ్రూ డైరెక్ట్ గా చంద్ర‌బాబుకు సరెండర్ అవుతారా? లేక చంద్రబాబు ద్రోహానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని వైసీపీలో చేరుతారా! అన్న విషయంపై  గోదావ‌రి జిల్లాప్ర‌జ‌లు దీర్ఘంగా చ‌ర్చించుకుంటున్నారు. ఇక మ‌రోవైపు నెహ్రూ స‌న్నిహితులు, అనుచ‌రులు మాత్రం తిరిగి సొంత గూటికి చేరితేని మంచిద‌ని ఆయ‌న‌కు స‌ల‌హా ఇస్తున్నారు. చూడాలి  జ్యోతుల నెహ్రూ త‌న త‌ప్పు తెలుసుకుని తిరిగి వైసీపీలోకి చేరుతారా లేక సైలెంట్ అవుతారా అన్న విష‌యం ప్ర‌స్తుతం స‌స్పెన్స్ గా మారుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.