హ‌రిబాబు రాజీనామా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-17 14:57:06

హ‌రిబాబు రాజీనామా

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబు త‌న ప‌ద‌వికి  రాజీనామా చేశారు... అయితే ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఒక‌రి పేరు ఫైన‌ల్ అయ్యింది అనే వార్త‌ల న‌డుమ ఆయ‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఇప్పుడు ఇదే పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆయ‌న త‌న  ప‌ద‌వికి రాజీనామా చేశార‌ని తెలుస్తోంది.
 
పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు  ఆయన రాజీనామా లేఖ పంపించినట్లు తెలుస్తోంది.... హరిబాబు ఆకస్మిక నిర్ణయానికి కారణాలేమిటో స్పష్టంగా తెలియడంలేదు. అయితే ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు పేరు కేంద్రం ఫైన‌ల్ చేసింద‌ని అందుకే ఈ నిర్ణ‌యం ఆయన తీసుకున్నారు అని తెలుస్తోంది.
 
ఇక ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా 90 శాతం మాజీ మంత్రి తాడేప‌ల్లి గూడెం ఎమ్మెల్యే పైడికొండ‌ల మాణిక్యాల‌రావు పేరు ఫైన‌ల్ అయింది అని తెలుస్తోంది... ఆయ‌న పేరు ఫైన‌ల్ కావ‌డం వ‌ల్ల మ‌రో వారంలో ఆయ‌న పేరుకు క‌మ‌లం పార్టీ ప్ర‌క‌టించ‌నున్న కార‌ణంగా హ‌రిబాబు రాజీనామా చేశారు అని తెలుస్తోంది.
 
సోము వీర్రాజు, కన్నా లక్ష్మినారాయణల పేర్లను కూడా పరిశీలించిన అధిష్టానం చివరికి పైడికొండల వైపే మొగ్గిందని, ఈ నిర్ణయంలో బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి రాంమాధవ​ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.