సోమిరెడ్డిపై కాకాని సంచ‌ల‌న కామెంట్స్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-25 15:18:11

సోమిరెడ్డిపై కాకాని సంచ‌ల‌న కామెంట్స్ ?

నెల్లూరు జిల్లాలో విజ‌యం వ‌రించ‌క మూడు ప‌ర్యాయాలు స‌ర్వేపల్లి నుంచి ఓట‌మి చెందుతూ వ‌చ్చారు మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి.. ముఖ్యంగా రెండు సార్లు కాంగ్రెస్ నేత ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి చేతిలో ఓట‌మిపాలైతే 2014 ఎన్నిక‌ల్లో కాకాని గోవ‌ర్ద‌న్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు..
 
ఇక తెలుగుదేశం అధికారంలోకి రావ‌డంతో సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు చంద్ర‌బాబు... ఇక స‌ర్వేప‌ల్లిలో ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ద‌న్ రెడ్డికి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డికి మాట‌ల వార్ జ‌రుగుతూనే ఉండేది... అయితే ఇక రెండవ ట‌ర్మ్ లో మంత్రి ప‌ద‌వి ఇచ్చారు సోమిరెడ్డికి సీఎం చంద్ర‌బాబు. దీంతో ఆయ‌న పార్టీ త‌ర‌పున బిజీ అయిపోయారు.
 
సోమిరెడ్డికి విదేశాల్లో అక్రమాస్తులు ఉన్నాయని కాకాని గ‌తంలో ఆరోపించారు.. ఆయన విదేశీ లావాదేవీలపై సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు.. అంత‌లా వీరిద్ద‌రి మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ న‌డిచింది.
 
ఇక గ‌తంలో ఎటువంటి కామెంట్లు చేసుకున్నారో దానికి అయితే ఫుల్ స్టాప్ ప‌డింది అని చెప్పాలి... ఎమ్మెల్సీగా ఉన్న‌ప్పుడు అంత బిజీగా లేని సోమిరెడ్డి మంత్రి అయిన త‌ర్వాత త‌న దూకుడు పెంచారు... ఇక జ‌గ‌న్ పాదయాత్ర‌లో కూడా జగ‌న్ కు జేజేలు ప‌లికారు ప్ర‌జ‌లు వేలాదిగా త‌ర‌లి వ‌చ్చారు. దీంతో జిల్లాలో సోమిరెడ్డికి మంత్రి నారాయ‌ణ‌కు ఎదురు దెబ్బె త‌గిలింది.
 
ఇక వివాదాల వ్యాఖ్య‌ల‌తో ఉండే  మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి పై తాజాగా ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.....2,200 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసేందుకు తెలుగుదేశం పార్టీ మంత్రి సోమిరెడ్డి ప్లాన్‌ చేశారని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు కూడా వెళ్లాయని అన్నారు.
 
అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో మొక్క మొలవని భూములను ఇచ్చి మైనింగ్‌ భూములను కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు...ఇప్పటికే మూడు గనుల్లో మైనింగ్‌ చేసి అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు. ఈ భూ కుంభకోణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. మొత్తానికి మ‌రో 2200 ఎక‌రాల కుంభ‌కోణం వైసీపీ వెలుగులోకి తీసుకురావ‌డంతో ఏపీలో అంద‌రి అటెన్ష‌న్ ఇటువైపు మ‌ళ్లింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.