మార్వాడీలపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-24 18:17:13

మార్వాడీలపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఎపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయ‌కులు మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు.అయితే ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్లొన్న టీడీపీ ఇంచార్జ్ ల‌కు ఫిరాయింపు ఎమ్మెల్యేల మ‌ధ్య గొడ‌వ‌లు తారా స్థాయికి చేరుకుంటున్న సంగ‌తి తెలిసిందే.
 
అయితే ఈ క్ర‌మంలో మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మాన్నిరాజ‌మండ్రిలో టీడీపీ నాయ‌కులు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళావెంకట్రావ్ హాజ‌ర‌య్యారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, మార్వాడీల కుల‌స్తుల‌ను కించ‌రిచే విధంగా మాట్లాడారు. 2014లో ప్ర‌ధాని మోడీ చాయ్ ఇప్పుడు అయిపోయింద‌ని కళావెంకట్రావ్ వ్యాఖ్యానించారు.
 
అంతే కాకుండా మార్వాడీ చాయ్ అంటే.. ఎవ‌రైనా పెద్ద‌లు వ‌చ్చిన‌ప్పుడు అరె భాయ్ అని చెప్పి అదే స‌మ‌యంలో చెయ్యి అడ్డంగా ఊపి తేవ‌ద్ద‌ని చెప్ప‌డ‌మే మార్వాడీ చాయ్ అర్థం అని క‌ళా వెంక‌ట్రావ్ వివ‌రిచారు. ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై  రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్న రాజ‌కీయ నాయ‌కులు కులాల‌కు వ్య‌తిరేకంగా పాటించాల్సింది పోయి కులంపేరు తో దూషించ‌డం ఏంట‌ని జ‌నాలు విమ‌ర్శిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే ఫిరాయింపు మంత్రి ఆదినారాయ‌ రెడ్డి కూడా ఓ కార్య‌క్రమంలో ఎస్సీల‌ను కించప‌రుస్తూ మాట్లాడారు.
 
ఎస్సీలు వారం అయినా స్నానం చేయ‌ర‌ని, వారికి రిజ‌ర్వేష‌న్లు దండ‌గ‌ని, వారికోసం ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చినా చ‌దువుకోర‌ని కించ‌ప‌రిచారు. అలాగే మొన్న‌టికి మొన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా ఎస్సీల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడుతూ, పుడుతూ పుడుతూ ఎవ‌రు ఎస్సీలుగా పుట్టాల‌ని కోరుకుంటార‌ని మాట్లాడారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ కుల‌స్తులు టీడీపీ పై ఆగ్ర‌హంతో ఉన్నారు.
 
ఇక ఇప్పుడు మంత్రి క‌ళావెంక‌ట్రావ్ మార్వాడీల‌ను కించ‌ప‌ర‌చ‌డంతో వారిలో కూడా సైకిల్ పార్టీపై వ్య‌తిరేక‌త ఎక్కువ అవుతోంది.ఇక ఇప్ప‌టికే కాపులు, బీసీలు,తాజాగా బ్రాహ్మ‌ణులు కూడా టీడీపీపై వ్య‌తిరేక‌త‌ పెరిగిపోయింది. మొత్తానికి ఎవ‌రు తీసుకున్న గుంత‌లో వారు ప‌డ‌క త‌ప్ప‌దు అన్న‌ట్లు టీడీపీ నాయ‌కులు కూడా అలానే ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.