క‌ళ్యాణ్ రామ్ కొత్త వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-14 15:10:36

క‌ళ్యాణ్ రామ్ కొత్త వ్యాఖ్య‌లు

హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ తెలుగు దేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై తిరుప‌తిలో ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.. శ్రీ వారిని ద‌ర్శించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన రామ్ మీడియాతో మాట్లాడారు... చంద్ర‌బాబు (మామ‌య్య) అంటే త‌న‌కు అభిమాన‌మ‌ని, ఏ రాజ‌కీయ‌ నాయ‌కుడు చేయ‌లేని ప్ర‌జా సేవ ఆయ‌న చేస్తున్నార‌ని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు రామ్... ప్రజల కోసం ఆయన నిరంతరం పనిచేస్తార‌ని, అందుకే ప్రజాదరణ ఉన్న నేత అయ్యారని చెప్పుకొచ్చారు. 
 
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మీరు తెలుగుదేశం పార్టీ త‌రపున ప్ర‌చారం చేస్తారా అని మీడియా ప్ర‌శ్నించ‌గా... ఇందుకు ఆయ‌న స‌మాధానం ఇస్తూ... తాను ప్ర‌చారం చేయ‌డం వ‌ల్ల పార్టీకి మేలు జ‌రుగుతుందంటే తాను క‌చ్చితంగా టీడీపీ త‌ర‌పున ప్ర‌చారం చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు... అలాగే త‌న త‌మ్ముడు జూనియర్ ఎన్టీఆర్  కూడా ప్ర‌చారం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు రామ్.
 
నవ్యాంధ్ర సాధనకు చంద్రబాబు పాలన ఎంతో అవసరమని, ఆయన పాలన లేకపోతే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే హోదా అంశం విషయమై పోరాటం చేయాల్సి వ‌స్తే... తాము సిద్ధం అని తెలియ‌చేశారు.
 
అయితే మ‌రోవైపు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌లు చోట్ల నంద‌మూరి అభిమానులు త‌ప్పుబ‌డుతున్నారు... గ‌తంలో  టీడీపీ త‌ర‌పున క‌ళ్యాణ్ త‌మ్ముడు జూనియ‌ర్ ఎన్టీఆర్ రాష్ట్ర‌వ్యాప్తంగా  ప్ర‌చారం చేస్తే క‌నీసం పార్టీ త‌ర‌పున చంద్ర‌బాబు నాయుడు ఎన్టీఆర్ కు మెంబ‌ర్ షిప్ కార్డుకూడా ఇవ్వ‌లేద‌ని ప్ర‌జ‌లు గుర్తు చేశారు... అయితే మ‌ళ్లీ ఇప్పుడు అదే త‌ప్పును క‌ళ్యాణ్ రామ్ చేస్తున్నార‌ని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు... మొత్తానికి టీడీపీ v/s నంద‌మూరి అభిమాలు అన్న‌ట్లు జ‌రుగుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.