రేపే కమ‌ల్ రాజ‌కీయ సినిమా....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-20 05:25:14

రేపే కమ‌ల్ రాజ‌కీయ సినిమా....

రాజ‌కీయ సినిమా అంటే ఆయ‌న సినిమా చేయ‌డం లేదు లోక‌నాయ‌కుడు రాజ‌కీయాల్లో త‌న విశ్వ‌రూపం చూప‌డానికి రెడీ అయిన విష‌యం తెలిసిందే.. ఇక ఈ స‌మ‌యంలో క‌మ‌ల్ ఇటీవ‌లే రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు... సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతున్న త‌రుణంలో, క‌మల్ హాస‌న్ త‌న పార్టీ ఏర్పాటు దిశ‌గా ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ను భేటీ అవుతున్నారు... ఈ భేటీలో త‌న పార్టీ ప్ర‌స్తావ‌న గురించి, సుదీర్గంగా వారితో చ‌ర్చించారు క‌మ‌ల్... అయితే ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, డీఎంకే అధినేత క‌రుణానిధిని క‌లిసి వారితో త‌న పార్టీ గురించి చ‌ర్చించారు లోక‌నాయ‌కుడు...
 
అయితే తాజాగా, మ‌రోసారి డీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి  రాజ‌కీయ సీనియ‌ర్ నేత విజ‌య‌కాంత్ తో సోమ‌వారం నాడు క‌మ‌ల్ హాస‌న్ భేటీ అయ్యారు.... ఆయ‌న‌తో సుమారు గంట‌న్న‌ర పాటు సుధీర్గంగా చ‌ర్చించి రేపు ప్రారంభించ‌బోయే పార్టీ గురించి క‌మ‌ల్ విజ‌య‌కాంత్ తో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది... కాగా మీలాంటి వారు రాజ‌కీయ అరంగేట్రం చేయ‌డం ప్ర‌జ‌ల‌కు చాలా అవ‌స‌ర‌మ‌ని, నా స‌పోర్ట్ మీకు ఎల్ల‌వేళ‌లా ఉంటుంద‌ని, క‌మ‌ల్ కు  శుభాకాంక్ష‌లు తెలిపారు విజ‌య‌కాంత్.
 
ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్ మీడియాతో మాట్లాడుతూ... తాను పార్టీ ప్రారంభించే ముందు ఇలాంటి గొప్ప రాజ‌కీయ వేత్త‌ల‌ను క‌ల‌వ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని, వారి ఆశీస్సుల‌తోనే ముందుకు పోతాన‌ని తెలిపారు... అందులో భాగంగానే తాను ర‌జ‌నీకాంత్ ను క‌ల‌వ‌డం వ‌ల్ల త‌మ‌కు ఎలాంటి ఇబ్బంది క‌లుగ‌ద‌ని క‌మ‌ల్ మీడియాతో అన్నారు... రేపు రామేశ్వరంలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, పార్టీ సిద్దాంతాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు క‌మ‌ల్.. ఆ రోజే మథురైలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించ‌నున్నారు క‌మ‌ల్ హాస‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.