కమల్ హాసన్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-14 01:03:27

కమల్ హాసన్ సంచ‌ల‌న నిర్ణ‌యం

దేశ రాజ‌కీయాల్లో  త‌మిళ‌నాడుకు ఒక ప్ర‌త్యేక‌మైన‌ స్థానం ఉంది...సినీ దిగ్గ‌జాల వాడ‌గా త‌మిళ‌నాడును చూస్తారు దేశరాజ‌కీయాల్లో.. ముఖ్య‌మంత్రి  జ‌య‌ల‌లిత అకాల‌ మ‌ర‌ణం త‌రువాత,  త‌మిళ రాజకీయాల్లో నెల‌కొన్న ప‌రిస్థితులు అంద‌రికి తెలిసిందే... ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించే నాయ‌కులు క‌రువ‌య్యారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌జా సేవ చేయ‌డానికి సినీ రంగం నుంచి అనేక మంది న‌టులు, రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తున్నారు..
 
ఇటీవ‌ల త‌మిళ రాజ‌కీయాల్లోకి రావాల‌నుకున్న యంగ్ హీరో విశాల్ ఏకంగా ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నికకు నామినేష‌న్ కూడా వేశారు..అయితే కొన్ని కార‌ణాల రిత్యా విశాల్ నామినేష‌న్ ను  ఈసీ తిర‌స్క‌రించింది....  ప్ర‌స్తుతం త‌మిళ సూపర్ స్టార్ రజనీకాంత్,  లోక‌నాయ‌కుడు  కమల్ హాసన్‌లు రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌డంతో ఇక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 
వీళ్లు ఇద్ద‌రూ మంచి మిత్రులు కావ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి పెరిగింది.ఈ నేపథ్యంలో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించిన విశ్వనటుడు కమల్ హాసన్, తమిళ రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ పార్టీలో కాషాయ రంగు ఉంటే, ఆయనతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని కమల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
 
రాష్ట్రాభివృద్దిలో కీల‌క‌మైన వ్య‌వ‌సాయం, విద్య‌, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో త‌మిళ‌నాడు అత్యంత వెనుక‌బ‌డింద‌ని అన్నారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం సాధించాలన్నదే తన లక్ష్యమని..... అందుకోసం రాష్ట్రంలో ఉన్న‌ ప్ర‌తీ జిల్లాలో ఒక గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని అభివృద్ది చేస్తాన‌ని, అందుకు ప్ర‌జ‌లు స‌హ‌కారం కావాల‌ని అని కోరారు.
 
ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లుసుకోవ‌డానికి ఫిబ్రవరి 21 నుంచి నలాయి నమదే (రేపు మనదే) పేరుతో ప్రజాయాత్ర చేపడుతున్న‌ట్లు కమల్ తెలిపారు. రామనాథపురంలో ఉన్న దివంగత మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ స్వ‌గృహం నుంచి తన యాత్ర ను కమల్ ప్రారంభించబోతున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డానికి సినిమాలు వ‌దిలి పూర్తి స్థాయి రాజ‌కీయాలు చేస్తాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారాయ‌న‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.