మంత్రి సోమి రెడ్డితో జ‌గ‌న్ మేన‌మామ భేటి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-12 06:14:56

మంత్రి సోమి రెడ్డితో జ‌గ‌న్ మేన‌మామ భేటి

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మేన‌మామ‌, క‌మ‌లాపురం ఎమ్మెల్యే పోచ‌మ రెడ్డి ర‌వీంద్ర‌నాధ్ రెడ్డి సోమవారం నాడు  వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్ర‌స్తుతం ఏపీలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌ధ్యంలో వీరిద్ద‌రి క‌ల‌యిక చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 
 
అయితే,  క‌డ‌ప జిల్లాలో రైతుల‌కు రావాల్సిన వేరు శ‌న‌గ ఇన్సూరెన్స్ రూ.276 కోట్లు వెంట‌నే విడుదల చేయాల‌ని మంత్రి సోమి రెడ్డిని ర‌వీంధ్ర‌నాద్ రెడ్డి కోర‌డం జ‌రిగింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన సోమి రెడ్డి, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో మాట్లాడి రైతుల‌కు నిధులు విడుద‌ల అయ్యేలా కృషి చేస్తాన‌ని ర‌వీంద్ర నాద్ రెడ్డికి చెప్పిన‌ట్లు తెలిసింది. 
 
సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ప్ర‌స్తుతం క‌డ‌ప జిల్లా టీడీపీ ఇన్ ఛార్జ్  మంత్రిగా కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలో అధికార ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సోమి రెడ్డి క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలో  రైతుల గురించి మాట్లాడేందుకు ర‌వీంధ్ర‌నాధ్ రెడ్డి, సోమి రెడ్డితో స‌మావేశం అయ్యారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.