పెద‌వి విప్పిన బాబు - బీజేపీ స‌న్నిహితుడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-10 04:05:51

పెద‌వి విప్పిన బాబు - బీజేపీ స‌న్నిహితుడు

విభ‌జిత్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఎటువంటి న్యాయం కేంద్రం చేయ‌డం లేద‌ని, ఓ ప‌క్క విమ‌ర్శలు వెళ్లువెత్తుతున్నాయి.. ఏపీలో బీజేపీ పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది.. ఈ స‌మ‌యంలో పార్టీలో కొంద‌రు బీజేపీ నేత‌లు పార్టీకి మైన‌స్ కాకుండా ఎటువంటి డ్యామేజీ పార్టీకి జ‌రుగ‌కుండా జాగ్ర‌త్తలు ప‌డుతున్నారు.. అయినా బీజేపీ నాయ‌కుల‌కు కాస్త ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి.
 
ఇక బీజేపీలో ఏపీ మంత్రుల్లో కామినేనికి బాబుకు మ‌ధ్య మంచి రిలేష‌న్ ఉంద‌ని ఆయ‌న  తెలుగుదేశానికి స‌పోర్ట‌ర్ అని అంటారు చాలా మంది.. అలాగే ఎంపీల‌లో బీజేపీ ఎంపీ హ‌రిబాబు ను కూడా తెలుగుదేశానికి స‌పోర్ట‌ర్ అని అంటారు.. తాజాగా ఆయ‌న కూడా మొత్తానికి పెద‌వి విప్పారు.. విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న హామీలు నెర‌వేర్చేందుకు కేంద్రం సిద్దంగా ఉంద‌ని.. బీజేపీ ఇప్ప‌టికే అనేక హామీలు నెర‌వేర్చింది అని అన్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు.
 
అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏపీకి కేంద్రం ఇప్పటివరకూ ఇచ్చిన నిధులు, మంజూరు చేసిన ప్రాజెక్టులు, సంస్థల వివరాలతో కూడిన 27 పేజీల నోట్‌ను మీడియాకు ఆయ‌న విడుద‌ల  చేశారు... విభ‌జ‌న హామీల అమ‌లుకు కేంద్రం క‌ట్టుబ‌డి ఉంద‌ని ప్యాకేజీలో ప్ర‌త్యేకంగా ఏపీకి కావల‌సిన‌వి అన్ని ఇస్తామ‌న్నారు. 
 
రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే రూ,2,500 కోట్లు ఇచ్చాం
పోలవరం నిర్మాణానికి రూ.4,662.28 కోట్లు విడుదల చేశాం
విభజన చట్టం ప్రకారం కేవలం 5 సంస్థలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి
కడప స్టీల్ ప్లాంట్ విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం
దుగరాజపట్నం పోర్టుకు రక్షణ శాఖ నుంచి, ఇస్రో నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం సూచిస్తే, అక్కడ వెంటనే పోర్టు నిర్మాణం చేపడతాం
రైల్వే జోన్ అంశం కూడా త్వరలో ప్రకటన ఉంటుంది. ఏర్పాటు జరుగుతుంది
చట్టంలో పదేళ్ళ కాలపరిమితిలోగా ఇవన్నీ చేయాలని ఉంది.
కానీ నరేంద్ర మోదీ సర్కారు మాత్రం మూడేళ్లలోనే చాలా ఇచ్చింది
85 శాతం హామీలు మూడున్నరేళ్లలో అమలు చేశాం
వెంకయ్య నాయుడు చొరవతో చట్టంలో ఉన్నవే కాదు, లేనివి కూడా మంజూరు అయ్యాయి
రూ. లక్ష కోట్ల విలువ చేసే జాతీయ రహదారులు మంజూరు చేశాము.
షిప్పింగ్ మరియు వాటర్ వేస్లో కూడా చట్టంలో లేని ప్రాజెక్ట్ మంజూరు చేసాం
పెట్రోలియం కాంప్లెక్స్ పని కూడా జరుగుతుంది
తిరుపతి ఐఐటీకి రూ.90.93 కోట్లు కేంద్రం ఇచ్చిందని ఆయ‌న వెల్ల‌డించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.