బీజేపీ చెవిలో క‌మ‌లం పెట్టిన కామినేని త్వ‌ర‌లో టీడీపీ తీర్ధం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-11 16:59:01

బీజేపీ చెవిలో క‌మ‌లం పెట్టిన కామినేని త్వ‌ర‌లో టీడీపీ తీర్ధం

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, బీజేపీ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్దం రోజు రోజుకు పెద్ద ఎత్తున కొన‌సాగుతూనే ఉంది. అయితే ప్ర‌స్తుతం ఈ మాట‌ల యుద్దం సృతిమించ‌డంతో ఒక‌రిపై మ‌రొక‌రు దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంటున్నారు. ప్ర‌ధాని మోడీపై, అలాగే కేంద్ర ప్ర‌భుత్వం పై టీడీపీ నాయ‌కులు విమ‌ర్శలు చేస్తున్నారు.ఇదే క్ర‌మంలో టీడీపీ ప‌రిపాల‌న‌పై బీజేపీ నాయ‌కులు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. 
 
దీంతో పాటు ఒకరికి వ్య‌తిరేకంగా మ‌రొక‌రు దీక్ష‌లు చేస్తున్నారు. అయితే కొద్ది కాలంగా ఈ రెండు పార్టీల మ‌ధ్య యుద్దం జ‌రుగుతున్నా కూడా మాజీ మంత్రి కామినేని మాత్రం అంటిముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టీడీపీ నాయ‌కులు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాలైన‌టువంటి ప్ర‌త్యేక హోదాపై బీజేపీ నాయ‌కుల‌ను దోషిగా నిల‌బెట్టేందుకు టీడీపీ ప్ర‌య‌త్నం చేస్తున్నా కామినేని మాత్రం మ‌న‌కు ఎందుకులే అనే ఫార్ములాను ఫాలో అవుతున్నార‌ట‌. 
 
అయితే ఆయ‌న క‌నీసం మాట వ‌రుస‌కు అయినా అటు చంద్ర‌బాబు నాయుడును కానీ ఇటు టీడీపీ ప్ర‌భుత్వాన్ని కానీ ప‌ల్లెత్తి మాట అన‌కపోవ‌డం బీజేపీ శ్రేణుల్లో అనేక అనుమానాలకు దారి తీస్తోంది. అంతేకాదు ఇలీవ‌లే బీజేపీ నిర్వహించిన అన్ని కార్య‌క్ర‌మాల‌కు కామినేని దూరంగా ఉండ‌ట‌మే కాకుండా మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత పార్టీ కార్యాలయానికి వ‌చ్చిన దాఖ‌లు లేవ‌ట‌. 
 
బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష‌నేత విష్ణుకుమార్ రాజు సైతం ఒక్కొక్క సంద‌ర్భంలో సీఎం చంద్ర‌బాబును పొగుడుతున్నా మిగతా సంద‌ర్భాల్లో టీడీపీ నాయ‌కులను ఎండ‌గ‌డుతున్నారు. అయితే విష్ణుకుమార్ రాజులాగ అయినా కామినేని నోరు మెద‌ప‌డం లేద‌ని రాష్ట్ర బీజేపీ నాయ‌కులు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.
 
టీడీపీ, బీజేపీ నాయ‌కులు విడాకులు తీసుకున్న త‌ర్వాత కూడా కామినేని టీడీపీ నేత‌ల‌తో చెట్టాప‌ట్టాలు వేసుకుని తిర‌గ‌డంపై అనేక అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర అధికార నాయ‌కుల మ‌ధ్య వాతావ‌రణం ఉప్పు నిప్పుగా ఉన్న టైమ్ లో కూడా ప‌శ్చిమ‌గోదావ‌రి గుంటూరు జిల్లాల్లో జ‌రిగిన కార్య‌క్రామాల్లో టీడీపీ నాయ‌కుల‌తో క‌లిసి కామినేని పాల్గొన‌డం అనేక విమ‌ర్శ‌లకు దారి తీస్తోంది. 
 
అంతేకాదు త్వ‌ర‌లో కామినేని టీడీపీ తీర్థం తీసుకుంటార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే బీజేపీలో జ‌రుగుతున్న అంత‌ర్గ‌త స‌మాచారాన్ని కామినేని, సీఎం చంద్ర‌బాబుకు ఎప్ప‌టిక‌ప్పుడు చేర‌వేస్తున్నార‌ని బీజేపీ నాయ‌కులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ సారి కూడా కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌పున కామినేని పోటీ చేస్తార‌నే వార్తలు కూడా వ‌స్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.