గంటా రాయ‌భారం ఫెయిల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-28 18:13:07

గంటా రాయ‌భారం ఫెయిల్

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం నుంచి బీజేపీ నుంచి వ‌ల‌స‌లు స్టార్ట్ అయ్యాయి..... ఇక తాజాగా ఉత్త‌రాంధ్రా నాయ‌కులు మాజీ ఎమ్మెల్యే క‌న్న‌బాబు తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరుతాన‌ని ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే తెలుగుదేశం అల‌ర్ట్ అయింది... వెంట‌నే న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది... మే5 న వైసీపీలో చేరుతా అని,  జ‌గ‌న్ పాద‌యాత్ర ఎక్క‌డ ఉంటే అక్క‌డ వైసీపీలో చేరుతా అని చెప్పారు క‌న్న‌బాబు..
 
ఇక ఇప్ప‌టికే వైసీపీలో చేరిక‌ల‌తో తెలుగుదేశంలో మ‌రింత తీవ్ర ప్రెజ‌ర్ పెరిగింది... స్ధానిక నాయ‌కుల‌కు మంత్రుల‌కు బాబు వ‌ల‌స‌ల నివార‌ణ చేయాలని తెలియ‌చేశారు... ఇందులో భాగంగా ఉత్త‌రాంధ్రా టీడీపీ నేత మంత్రి గంటా శ్రీనివాస‌రావు, క‌న్న‌బాబుతో మాట్లాడారు పార్టీ మారే నిర్ణ‌యం ఉప‌సంహరించుకోవాల‌ని కోరారు.
 
అయితే తనకు పార్టీలో గుర్తింపు లేదని, తాను వైసీపీలో  చేరనున్నట్లు మంత్రి గంటాకు కన్నబాబురాజు స్పష్టం చేశారు దీంతో మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు వైసీపీలో చేరకుండా టీడీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
 
మే 5న జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరుతున్నానని కన్నబాబురాజు స్పష్టం చేశారు. తాను ఏం ఆశించకుండా టీడీపీలో చేరానని.. పార్టీ విజయానికి తనవంతు కృషి చేశానని చెప్పుకొచ్చారు. పార్టీలో సరైన గుర్తింపు లేనందుకే పార్టీని వీడుతున్నానని తెలిపారు. వైఎస్‌ అభిమానులు రావాలని ఆహ్వానించినందుకు వైసీపీలో చేరుతున్నానని కన్నబాబురాజు పేర్కొన్నారు.
 
ఇక తెలుగుదేశంలో ఇప్ప‌డు క‌న్న‌బాబు వైసీపీలో వెళుతున్నారు అన‌గానే మ‌రో వైపు వైరి వ‌ర్గం ఆనందంగా ఉంది... ఆయ‌న పార్టీలో సీటుకు పోటీ వ‌స్తారు అనుకుంటే సంవ‌త్స‌రం ముందే ఆయ‌న వైసీపీలో చేరుతానని ప్ర‌క‌టించారు అని ఆ వ‌ర్గం అంటోంది... మొత్తానికి కొణ‌తాల అనుచరుడు వైసీపీలో ఎంట్రీకి తెలుగుదేశం అడ్డుక‌ట్ట‌లు వేసి నిలువ‌రించ‌లేక‌పోయింది అని జిల్లా నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.