నేడు వైసీపీలోకి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-05 15:07:54

నేడు వైసీపీలోకి

తెలుగుదేశం పార్టీకి  షాక్ ల మీద షాక్ లు త‌గులుతున్నాయి...మాజీ ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తి రాజు (కన్నబాబు), ఆయన కుమారుడు, విశాఖ డీసీసీబీ చైర్మన్‌ యు. సుకుమారవర్మలు శుక్రవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.గ‌త కొంత కాలంగా క‌న్న‌బాబు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలి అని భావించారు.. దీంతో  జిల్లా తెలుగుదేశం నాయ‌కులు ఆయ‌న పార్టీ మార‌కుండా నిలువ‌రించాలి అని అనుకున్నారు... అయితే ఆయ‌న పార్టీ మారాల‌ని చివ‌ర‌కు భావించారు.
 
ఇప్ప‌టికే వెంకటరావు, పంచకర్ల రమేష్‌బాబులకు పంపినట్టు సుకుమారవర్మ తెలిపారు. తమ అనుచరులతో కలసి శనివారం వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు... నేడు జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌రుగుతున్న ప్రాంతంలో వారు జ‌గ‌న్ ను క‌లిసి పార్టీలో చేరుతున్న‌ట్టు తెలియ‌చేశారు.
 
కన్నబాబు విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పనిచేశారు. 2014 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. ఇక సెగ్మెంట్లో వ‌ర్గవిభేదాలు రావ‌డం, అలాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు కూడా వ‌స్తుందో లేదో అనే ఉద్దేశ్యం, అలాగే పార్టీలో ఆయ‌న‌కు స‌ముచిత స్ధానం లేక‌పోవ‌డం వ‌ల్ల ఆయ‌న పార్టీ మార‌తాను అని తెలియ‌చేశారు.. ఇక ఓసారి తీసుకున్న నిర్ణ‌యంలో మార్పులేదు అని ఇటీవ‌ల ఆయ‌న తెలియ‌చేశారు... మొత్తానికి అలాగే ఆయ‌న పార్టీలో చేరుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.