బాబు కు క‌న్నా కౌంట‌ర్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-08 11:51:35

బాబు కు క‌న్నా కౌంట‌ర్ ?

తెలుగుదేశం నాయ‌కుల‌పై బీజేపీ నేత‌లు మాట‌ల తూటాలు పేల్చుతున్నారు..బీజేపీ నేత‌ల మాట‌ల దాడి కొనసాగుతోంది,..తాజాగా గుంటూరు జిల్లాలో బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బాబుకు కౌంట‌ర్ ఇచ్చారు. ఏపీ తెలుగుదేశం నాయ‌కులు బీజేపీ పై కౌంట‌ర్లు వేయ‌డం మానుకోవాలి అని హిత‌వు ప‌లికారు.
 
సీఎం చంద్ర‌బాబుకు చుర‌క‌లు అంటించారు . టీడీపీ నేతలు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ వృధా ఖర్చులు చేస్తున్నారని మండిపడ్డారు.. రాష్ట్రాన్ని అప్పుల‌పాలు చేస్తున్నార‌ని వీరి ప‌ర్య‌ట‌న‌ల వ‌ల్ల ఎటువంటి ప్ర‌తిఫ‌లం లేద‌ని ఒక్క‌రూపాయి పెట్టుబ‌డి రాలేద‌ని అన్నారు కన్నాలక్ష్మీనారాయ‌ణ‌.
 
ఏపీ రాజధాని అమ‌రావ‌తి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2,500 కోట్లు ఇచ్చినా, ఇక్క‌డ ఒక్క  చిన్న నిర్మాణం కూడా మొదలు పెట్టలేదని ఇదే వీరి ప‌రిపాల‌న‌కు నిద‌ర్శ‌నం అని అన్నారు... కేంద్రం ఇచ్చిన సొమ్ముకు లెక్కా ప‌త్రాలు లేవ‌ని క‌నీసం డీపీఆర్ ఇవ్వ‌కుండా నిధులు ఇవ్వ‌మంటే ఎలా ఇస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.
 
ప్ర‌తిష్టాత్మ‌క రాజ‌ధాని అని చెబుతున్న మీరు, సినిమా డైరెక్టర్లతో డిజైన్లు వేయించడం ఎంతవరకూ సమంజసం అని క‌న్నా ప్రశ్నించారు... నిధులు ఎన్ని ఇచ్చినా ప‌క్కా ప‌త్రాలు లెక్క‌లు చెప్ప‌క‌పోతే ఎవ‌రూ నిధులు ఇవ్వ‌డానికి ముందుకు రార‌ని అన్నారు. కేంద్రంపై నింధ‌లు ఆపి ముందు మీరు చేసిన ఖ‌ర్చుకు లెక్క‌లు చూపాలి అని ఏపీ స‌ర్కారు పై ఫైర్ అయ్యారు క‌న్నా.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.