కన్నా ల‌క్ష్మినారాయ‌న‌కు కీల‌క ప‌ద‌వి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-13 03:33:39

కన్నా ల‌క్ష్మినారాయ‌న‌కు కీల‌క ప‌ద‌వి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ నాయ‌కుల‌కు క‌ర్ణాట‌క ఎన్నిక‌లు పూర్తి అయిన నేప‌థ్యంలో క‌న్నా లక్ష్మీనారాయణ‌కు, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు బీజేపీ ప్ర‌భుత్వం కీల‌క ప‌ద‌వులును అప్ప‌చెబుతూ ఒక ప్ర‌క‌ట‌న‌ విడుద‌ల చేసింది. ఈ ప్ర‌క‌ట‌నలో క‌న్నా లక్ష్మీనారాయణ‌కు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవీబాధ్యతలను అప్పజెప్పింది. అలాగే ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ గా బాధ్య‌ల‌త‌ను క‌ట్ట‌బెట్టింది.
 
ఈ మేర‌కు క‌న్నా మీడియాతో మాట్లాడుతూ, త‌మ‌కు అదిస్టానం కీల‌క ప‌ద‌వులును ప్ర‌క‌టించ‌డంపై సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ది కోసం తాను నిరంతరం కృషి చేస్తాన‌ని, త‌మ నాయ‌కులు అమిత్ షా, ప్ర‌ధాని మోడీ న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తాన‌ని క‌న్నా అన్నారు. అయితే గ‌తంలో క‌న్నా బీజేపీని వీడి ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ చేరుతార‌నే వార్త రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే అక‌స్మాత్తుగా ఆయ‌నకు ఆరోగ్యం క్షిణించ‌డంతో అధికారికంగా ఎలాంటి నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌లేదు. దీనికి సంబంధించిన  మ‌రికొద్ది రోజుల్లో స‌మాచారం తెలియాల్సి ఉంది.
 
 
ఇక సోము వీర్రాజు  కూడా త‌మ‌కు కేంద్రం ప‌ద‌వుల‌ను అప్ప‌గించ‌డంపై త‌న ఆనందాన్ని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో పంచుకున్నారు ఆయ‌న‌. త‌మ కృషిని కేంద్రం గుర్తించి త‌న‌కు ఈ ప‌ద‌విని కేటాచింనింద‌ని అన్నారు. అలాగే మొన్న తిరుప‌తిలో జ‌రిగిన సంఘ‌ట‌న‌పై కుడా స్పందిస్తూ, మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సోమువీర్రాజు. త‌మ పార్టీ నాయ‌కుడు అమిత్ షా క‌ర్ణాట‌క ఎన్నిక‌లు ముగించుకుని ద‌ర్శ‌ణం నిమిత్తం తిరుమ‌ల‌కు చేరుకుంటే చంద్ర‌బాబు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తో దాడి చేయిస్తారా అని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు నాయుడు లాగ‌  మాట మార్చే త‌త్వం ఏ రాజ‌కీయ నాయ‌కుడికి లేద‌ని వీర్రాజు అరోపించారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.