క‌న్నాకు లైన్ క్లియ‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-30 19:23:40

క‌న్నాకు లైన్ క్లియ‌ర్

గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి క‌న్నాల‌క్ష్మీనారాయ‌ణ వైసీపీ ఎంట్రీ పై ఇప్ప‌టికే ప‌లువార్త‌లు వినిపిస్తున్నాయి... ఆయ‌న ఎంట్రీ ఇవ్వ‌క‌పోవ‌డానికి ప‌లు కార‌ణాలు ఉన్నాయి అనేది గ‌త వారం రోజులుగా తెలిసిందే.. అయితే రెండు రోజుల క్రిత‌మే క‌న్నా వైసీపీలో చేరాలి, అయితే ఆయన ఎంట్రీకి బ్రేకులు ప‌డ్డాయి.. ఆయ‌న ఆరోగ్యం బాగోక‌పోవ‌డంతో పార్టీలో చేర‌లేదు క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌.
 
అయితే బీజేపీలో ఉంటే క‌న్నాకు రాష్ట్ర అధ్య‌క్షుడి ప‌ద‌వి వ‌స్తుంది అని అంటున్నారు... మ‌రో ప‌క్క బీజేపీ అధిష్టానం కూడా కాపుల ఓట్ల కోసం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి ఆయ‌న‌కు ఇవ్వాలి అని అనుకున్నారు, మ‌రో వైపు వైసీపీ కూడా ఆయ‌న‌కు న‌ర‌స‌రావు పేట ఎంపీ సెగ్మెంట్ ఆయ‌న త‌న‌యుడికి పెద‌కూర‌పాడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము అని హామీ ఇచ్చారు.
 
ఇక తాజాగా తెలుగుదేశం నుంచి కూడా ఆయ‌నకు మంచి ఆఫ‌ర్ వ‌స్తోంద‌ట... ఎలాగో బీజేపీ నుంచి బ‌య‌ట‌కు  వ‌ద్దామనుకున్నారు, మీరు బీజేపీలో ఉంటే పార్టీ అధికారంలోకి  వచ్చేది లేదు,  మీకు ఏ ప‌ద‌వి వ‌చ్చేది లేదు  అందుకే తెలుగుదేశంలోకి వ‌స్తే గుంటూరు జిల్లా రాజ‌కీయాలు అప్ప‌గిస్తాం, అలాగే జిల్లాలో ఎంపీ ఎమ్మెల్యే ఏ సీటు కావాలి అన్నా ఇస్తాం అన్నారట తెలుగుదేశం అధినేత‌...అలాగే మంత్రి ప‌ద‌వి కూడా ఇస్తాము అని తెలియ‌చేశార‌ట....అయితే గ‌తంలో ఓ కేసు విష‌యంలో క‌న్నాని ఇరికిద్దాము అనుకున్న తెలుగుదేశం పార్టీలోకి చేర‌డం ఎందుకు అని ఆయ‌న ఆలోచించార‌ట‌.
 
ఇక క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆస్ట్రాల‌జీని కూడా న‌మ్ముతారు,  ఈ స‌మ‌యంలో జ్యోతిష్యులు చెప్పిన దాని ప్ర‌కారం వైసీపీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అలాగే వైయ‌స్ జ‌గ‌న్ కు సీఎం యోగం ఉంద‌ని వైసీపీలో నీ భ‌విష్య‌త్తు బాగుంటుంది అని క‌న్నాకు తెలియ‌చేశార‌ట శ‌ర్మ అనే  జ్యోతిష్యులు .. దీంతో క‌న్నా వైసీపీ వైపు అడుగులు వేయాల‌ని ఫైన‌ల్ గా నిర్ణ‌యం తీసుకున్నారు....
 
ఇక వైసీపీ త‌ర‌పున  ఆయ‌న ఎంపీ సీటుకు ఫుల్ స్టాప్ పెట్టారు అని తెలుస్తోంది....మ‌న‌సు మార్చుకుని  పెద‌కూర‌పాడు అసెంబ్లీ టికెట్ త‌న‌కు,  అలాగే త‌న అనుచరుడు వెంక‌టేష్ యాద‌వ్ కు చీరాల టికెట్ ఇవ్వాలి అని జ‌గ‌న్ ను కోరార‌ట.. అయితే జ‌గ‌న్ ఈ విష‌యం పై ఒకే చెప్పారు అని తెలుస్తోంది... ఈ వారంలో క‌న్నా వైసీపీలో చేర‌డానికి రెడీ అవుతున్నారు అని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.