బాబుకు ముచ్చ‌ట‌గా ఐదు సూటి ప్ర‌శ్న‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-22 18:38:15

బాబుకు ముచ్చ‌ట‌గా ఐదు సూటి ప్ర‌శ్న‌లు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడును ప్ర‌శ్నిస్తూ భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనాయ‌రాయ‌ణ ప్ర‌తీ వారం లేఖ రూపంలో ప్ర‌శ్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టికే ఆయ‌న సీఎం కార్యాలయానికి ఎనిమిది లెట‌ర్లు పంపారు. ఇక ఇదే క్ర‌మంలో టీడీపీ ప‌రిపాల‌న‌ను విమ‌ర్శిస్తూ మ‌రో ఐదు ప్ర‌శ్న‌లను లేఖ ద్వారా ప్ర‌శ్నించారు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌...
 
అందులో మొద‌టిగా సీడ్ క్యాపిట‌ల్ ఏరియాను సింగ‌పూర్ కంపెనీల‌కు అప్ప‌జెప్ప‌డంలో అంత‌ర్యం ఏమిటీ అక్క‌డ అవినీతి జ‌రుగలేదా..!
 
2వ ప్ర‌శ్న మీ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు నామినేష‌న్ ప‌ద్ద‌తిలో ప్ర‌భుత్వ ప‌నుల‌ను ఇచ్చారు. దానిపై సీబీఐ విచార‌ణ సిద్ద‌మా!
 
3వ ప్ర‌శ్న ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధుల‌ను ఇత‌ర ప‌థ‌కాల‌కు మ‌ళ్లించ లేదా ప్ర‌చార ప‌థ‌కాల‌కు ఇష్టాను సారంగా నిధుల‌ను మ‌ళ్లించి అన్యాయం చేయ‌డం లేదా అని ప్ర‌శ్నించారు.
 
ఇక నాల్గ‌వ ప్ర‌శ్న ఆర్థిక నిర్వ‌హ‌ణ క‌ట్టుదిట్ట‌న‌ని చెప్పుకునే మీరు 10. 32 శాతం వ‌డ్డీ బాండ్ల‌ను ఎందుకు జారీ చేయ‌వ‌ల‌సి వ‌చ్చిందో వివ‌రించ‌గ‌ల‌రా అని సీఎంను నిల‌దీశారు.
 
ఇక చివ‌రిగా రాష్ట్రంలో ఖ‌నిజ సంప‌ద మొత్తం మీ పార్టీ నాయ‌కులు దోచుకుంటున్నార‌నే మాట వాస్త‌వం కాదా! ఇంత మైనింగ్ మాఫియా ఎప్పుడైనా చోటు చేసుకుందా ! చివ‌ర‌కు హైకోర్టు చివాట్లు పెట్టే వ‌ర‌కు స్పందించ‌ని మీ దౌర్భాగ్య ప్ర‌భుత్వం ఇంకా అధికారంలో కొన‌సాగే హక్కు ఉందా అని నిల‌దీశారు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.