సీఎం ర‌మేష్ దీక్ష వెన‌కున్న‌ అస‌లు నిజం ఇదే క‌న్నా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-21 17:49:07

సీఎం ర‌మేష్ దీక్ష వెన‌కున్న‌ అస‌లు నిజం ఇదే క‌న్నా

అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం ర‌మేష్ క‌డ‌ప జిల్లాలో ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ జెడ్పీ కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నిరాహార దీక్ష నేటితో రెండ‌వ రోజుకు చేరుకుంది. ఇక తాజాగా ఈ దీక్ష‌పై భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ స్పందించారు.
 
శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్య‌టించిన క‌న్నా అక్క‌డ మీడియాతో మాట్లాడుతూ, క‌డ‌ప ఉక్కు కోసం ఎవ్వ‌రు ప్రాణాల‌ను త్యాగం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిప‌క్ష‌మైనా అధికార ప‌క్షనాయ‌కులైనా కేంద్రానికి స‌హ‌కరిస్తే చాల‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ స్ప‌ష్టం చేశారు. 
 
అయితే టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ స్టీల్ ఫ్యాక్ట‌రీ కోసం దీక్ష చేయ‌డంలేద‌ని ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఓట్ల‌ను రాబ‌ట్టేందుకు దీక్ష‌ల పేరు చెప్పి డ్రామాలు ఆడుతున్నార‌ని క‌న్నా విమ‌ర్శించారు. ఈ డ్రామాలో సీఎం రమేష్‌ పాత్రధారి కాగా, చంద్రబాబు డైరెక్టర్ అని ఆయ‌న మండిప‌డ్డారు. అయితే టీడీపీ నాయ‌కులు దీక్ష‌ల పేరుతో ఎన్ని డ్రామాలు చేసినా ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఇకనైనా డ్రామాలు ఆపాలని క‌న్నా ల‌క్ష్మి నారాయ‌ణ‌ సూచించారు
 
2014లో ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాకు చేసింది ఏం లేద‌ని అన్నారు. ఎక్క‌డ వేసిన గొంగలి అక్క‌డే అన్నట్లు టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎక్క‌డి ప‌నులు అక్క‌డే నిలిచిపోయాయ‌ని విమ‌ర్శించారు. నాలుగు సంవ‌త్స‌రాల్లో చంద్ర‌బాబు వంశధార, తోటపల్లి ప్రాజెక్టులను పూర్తిచేశారా లేకా ఉద్ధానం కిడ్ని బాధితుల సమస్యను పరిష్కరించారా అని ప్రశ్నించారు క‌న్నా. ముఖ్య‌మంత్రి నిర్ల‌క్ష్యం వ‌ల్ల అమాయ‌క ప్ర‌జ‌లు బ‌లైపోతున్నార‌ని ల‌క్ష్మీనారాయ‌ణ‌ మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.