బాబు గురించి ప్ర‌ధానికి అదే చెప్పా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-14 15:55:59

బాబు గురించి ప్ర‌ధానికి అదే చెప్పా

మొత్తానిని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కు ఇటు వైసీపీ త‌ర‌పున జ‌గ‌న్ రాజ‌కీయంగా ప్ర‌తిప‌క్షంగా ఉంటే, ఇటు బీజేపీ త‌ర‌పున క‌న్నాకు ఛాన్స్ ఇచ్చిన త‌ర్వాత ఏపీ బీజేపీలో కూడా స‌రికొత్త రాజ‌కీయం మొద‌లైంది అనే చెప్పాలి.. వైసీపీ త‌ర‌పున జ‌గ‌న్ అదే విధంగా పార్టీ నాయ‌కులు తెలుగుదేశానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు..ఇటు బీజేపీ కూడా తెలుగుదేశానికి స‌రైన కీల‌క నాయ‌కుడిని ఏపీకి అధ్య‌క్షుడిగా చేయాల‌ని భావించి క‌న్నాల‌క్ష్మీనారాయ‌ణ‌కు ఛాన్స్ ఇచ్చారు.
 
అయితే  ఇప్పుడు రాజ‌కీయంగా క‌న్నా ప్ర‌ధాని మోదీని హ‌స్తిన‌లో క‌లిసి వ‌చ్చిన త‌ర్వాత  తెలుగుదేశం పార్టీ ఆలోచ‌న‌లో ప‌డింది.. అయితే ఈ స‌మ‌యంలో ఆయ‌న మ‌రో బాంబు పేల్చారు..ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను అడిగారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. 
 
అంతే కాకుండా ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రుగుతున్న చ‌ర్చ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అమ‌రావ‌తి శంకుస్ధాప‌న‌కు వ‌చ్చిన స‌మ‌యంలో నీళ్లు మ‌ట్టి తెచ్చి ఇచ్చార‌ని ఇప్ప‌టికీ విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటారు తెలుగుదేశం నేత‌లు.. అయితే అమ‌రావ‌తి శంకుస్ధాప‌న‌కు చంద్ర‌బాబే నీళ్లు తెమ్మన్నార‌ని వెల్ల‌డించారు..చంద్ర‌బాబే మోదీని అడిగార‌ని తెలియ‌చేశారు..కేంద్రం ద‌గ్గ‌ర నిధులు తీసుకుంటూ బీజేపీ పై విమ‌ర్శ‌లు చేశార‌ని ఇది రాజ‌కీయాల్లో చంద్ర‌బాబుకి అల‌వాటే అని ఆయన విమ‌ర్శించారు..
 
ఏపీ అభివృద్దిపై కేంద్రం చిత్త‌శుద్దితో ఉంద‌న్న విష‌యం త‌న‌కు అమిత్ షా తెలియ‌చేశార‌ని అన్నారు ఆయ‌న‌..చంద్రబాబు యూటర్న్‌ తీసుకోవడంపై మోదీ అడిగారని తెలిపారు...ఆయనకు మనం అందరికన్నా ఎక్కువ గౌరవం ఇచ్చాం, అడిగినవన్నీ చేశాం, అయినా ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అడిగారని చెప్పారు. అందుకు సమాధానంగా నమ్మిన వాళ్లకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు అలవాటేనని చెప్పానని కన్నా తెలిపారు... త్వ‌ర‌లోనే ఏపీకి సంబంధించి రైల్వే పెట్రో ప్రాజెక్టుల‌పై ఓ కీల‌క‌ ప్ర‌క‌ట‌న వ‌స్తుంది అని అన్నారు ఆయ‌న‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.