వైసీపీలో క‌న్నాకు లైన్ క్లియ‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-23 15:13:27

వైసీపీలో క‌న్నాకు లైన్ క్లియ‌ర్

గుంటూరు జిల్లాలో వైసీపీలోకి మాజీ మంత్రి బీజేపీ లీడ‌ర్ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ చేరుతారు అని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ప్ర‌స్తుత ప‌రిస్ధితుల్లో బీజేపీలో కొన‌సాగడం కంటే పార్టీమార‌డం బెట‌ర్ అని ఆయ‌న అనుకుంటున్నారు.. ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు ఆయ‌న‌తో ట‌చ్ లో ఉన్నారు, ఆయ‌న్ని పార్టీలోకి రావాలి అని ఇప్ప‌టికే వైసీపీ నాయ‌కులు అధిష్టానం ఆయ‌న‌కు గ‌తంలోనే ఆఫ‌ర్ ఇచ్చింది.
 
గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒకసారి గెలుపొందిన ఆయన.. కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పలు కీలక శాఖలు నిర్వహించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లోనే కాకుండా 1989-1994 మధ్య కూడా మంత్రిగా ఉన్నారు ఇక కాంగ్రెస్ లో ఆయ‌న‌కు గుంటూరు జిల్లా నుంచి మంచి పేరు గుర్తింపు వ‌చ్చింది.
 
గ‌తంలో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ ప‌రిస్ధితి ఏపీలో మ‌రింత దిగ‌జార‌డం గ‌త అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయ‌న కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం అప్పట్లో సంచలనమే సృష్టించింది. పార్టీ తీర్థం పుచ్చుకున్నాక.. రాష్ట్రమంతా పర్యటిస్తూ బీజేపీని బలోపేతం చేసేందుకు కన్నా తన వంతు కృషి చేశారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని వెనకేసుకొచ్చారు. రాష్ట్రానికి నిధులు, ప్రత్యేక హోదా, ప్యాకేజీల విషయంలో మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా సమర్థించి.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మొదటి నుంచీ సీఎంపై గట్టిగా మాట్లాడుతుండడంతో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఆయన పేరు కూడా వినిపిస్తూ వచ్చింది.
 
ఇక కాంగ్రెస్ లో కీల‌క నాయ‌కుడిగా ఉండి బీజేపీలో చేర‌డంతో ఆయ‌న‌కు మ‌రింత పేరు వ‌స్తుంది అనుకుంటే, ఆయ‌న అనుకున్న రీతిలో పేరు రాలేదు.. ఇక బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజుకు లేదా మాజీ మంత్రి పైడికొండ‌ల మాణిక్యాల‌రావుకు ఏపీ బీజేపీ ప‌గ్గాలు కేంద్రం ఇవ్వ‌నుంది అని  తెలియ‌డంతో ఆయ‌న ఇక పార్టీలో త‌మ‌కు స‌ముచిత స్ధానం లేదు అనే ఆలోచ‌న‌లోప‌డ్డారు.. ఇప్ప‌టికే రెండు రోజులుగా గుంటూరు, పెదకూరపాడు నియోజకవర్గాల్లోని త‌న అనుచ‌రుల‌తో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపారు.. బీజేపీని న‌మ్ముకుని మీరు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున పోటీ చేస్తే మీకు డిపాజిట్లు కూడా రావు అని నాయ‌కులు కేడ‌ర్ తెలియ‌చేశారు.. ప్ర‌జ‌ల్లో బీజేపీ పై న‌మ్మ‌కం లేదు అని ఆయ‌న కేడ‌ర్ సూచించారు.
 
ఇక వైసీపీ కూడా ఆయ‌న రాక‌పై గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తోంది... జిల్లాలో ఆయ‌న కోరిన చోట కూడా  వ‌ర్గ‌పోరు ఇక్క‌డ ఆయ‌న‌కు ఉండ‌దు... అందుకే ఆయన వైసీపీలో కి రావాల‌ని ఆలోచిస్తున్నారు.. ఇప్ప‌టికే  గుంటూరు పశ్చిమ టికెట్‌ ఇస్తామని వైసీపీ త‌ర‌పున ఆయ‌న‌కు హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే కన్నా ప్రధానంగా రెండు డిమాండ్లు పెడుతున్నట్లు సమాచారం. తనకు గుంటూరు లోక్‌సభ స్థానం, తన రెండో కుమారుడు ఫణికి గుంటూరు పశ్చిమ టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారని తెలిసింది. ఒకవేళ తనకు నరసరావుపేట లోక్‌సభ స్థానం ఇవ్వదలిస్తే పెదకూరపాడు ఎమ్మెల్యే టికెట్‌ తన కుమారుడికి ఇవ్వాలని షరతు పెడుతున్నట్లు తెలిసింది.. ఇక గుంటూరు ఎంపీ టికెట్  ప్రముఖ విద్యాసంస్థల అధినేత వారసుడైన లావు శ్రీకృష్ణ దేవరాయను వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా  జ‌గ‌న్ ఖ‌రారు చేశారు.. అందుకే క‌న్నాకు  న‌ర‌స‌రావు పేట ఎంపీ సీటు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ కూడా అంటోంది.
 
విశ్లేష‌ణ !! గ‌ణేష్. వి 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.