చంద్ర‌బాబు అందుకే దీక్ష‌లు చేస్తున్నారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-04 12:59:49

చంద్ర‌బాబు అందుకే దీక్ష‌లు చేస్తున్నారు

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని అవినీతి మ‌యంగా చేస్తున్నార‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మండిప‌డ్డారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, చంద్ర‌బాబు నాయుడు గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో అడ్డ‌మైన హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చార‌ని అయితే ఆయ‌న‌ అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్నా కూడా ఒక్క హామీను కూడా పూర్తిగా అమ‌లు చేయ‌లేద‌ని క‌న్నా మండిప‌డ్డారు.
 
బీజేపీ అధికారంలో వచ్చినప్ప‌టినుంచి ప్ర‌ధాని మోడీ ఏపీపై ప్ర‌త్యేక దృష్టి పెట్టార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  అంతే కాదు ఏ రాష్ట్రానికి కేటాయించ‌నన్ని నిధుల‌ను బీజేపీ ప్ర‌భుత్వం ఏపీకి కేటాయించింద‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ తెలిపారు. కానీ దానిని అమ‌లు చేయ‌డంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విఫ‌లం అయ్యార‌ని ఆయ‌న మండిప‌డ్డారు
 
ఇక ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న తురుణంలో మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని భావించి తాను చేసిన‌ నాలుగు సంవ‌త్స‌రాల త‌ప్పుల‌ను కేంద్రంపై తోసేందుకు సిద్ద‌మ‌య్యారని క‌న్నా విమ‌ర్శ‌లు చేశారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష‌ల పేరు చెప్పి ప్ర‌జా ధ‌నాన్ని విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేస్తున్నార‌ని ఆయ‌న మండిపడ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.