ఇదెక్క‌డి న్యాయం చంద్ర‌బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-04 16:06:07

ఇదెక్క‌డి న్యాయం చంద్ర‌బాబు

ప్ర‌స్తుతం ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల ప‌రిపాల‌న అద్వానంగా మారుతోంద‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ని మండిప‌డ్డారు. ఈ రోజు పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. చంద్ర‌బాబు నాయుడు కేవ‌లం రాజ‌కీయంలో ల‌బ్ధిపొందేందుకు మాత్ర‌మే దీక్ష‌లు చేయిస్తున్నార‌ని, ప్ర‌జా శ్రేయ‌స్సు కోసం కాద‌ని క‌న్నా విమ‌ర్శించారు.
 
టీడీపీ నాయ‌కులు ఏ కార్య‌క్ర‌మం చేప‌డితే ఆ కార్య‌క్ర‌మంలో కాంట్రాక్ట‌ర్ల‌ను మేపుతూ క‌మీష‌న్ల రూపంలో ప్ర‌భుత్వం తిరిగి ఆ డ‌బ్బును తీసుకుంటోంద‌ని క‌న్నా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. దీంతో పాటు టీడీపీ నాయ‌కులు రాష్ట్ర వ్యాప్తంగా జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను ఏర్పాటు చేసి అక్ర‌మంగా నిధుల‌ను దిగ‌మింగుతున్నార‌ని క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ మండిప‌డ్డారు. 
 
స‌భ‌ల్లో తెలుగు దేశంపార్టీ రైతుల పార్టీ అని చెప్పుకునే చంద్ర‌బాబు 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టినుంచి రైతుల‌కు ఎంత‌మేర‌కు మేలు చేసిందో శ్వేత‌ప‌త్రాన్ని విడుద‌ల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. రైతుల‌కు న‌కిలీ విత్త‌నాల‌ను అమ్ముతున్నా కూడా చంద్ర‌బాబు చూస్తూ ఉండిపోయారు త‌ప్ప న‌కిలీ విత్త‌నాలు అమ్మేవారిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని క‌న్నా మండిప‌డ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ది ప‌థంలో తీసుకువ‌చ్చేందుకు కేంద్రం క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.
 
టీడీపీ నాయ‌కులు చేసే ప్ర‌తీ గ్రామ అభివృద్ది కార్య‌క్ర‌మాని కేంద్రం నిధుల‌తోనే జ‌రుగుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. టీడీపీ నాయ‌కులు రాష్ట్ర నిధుల‌కింద అభివృద్ది చేస్తున్నామ‌ని ప్ర‌చారం చేయ‌డం ఏంట‌ని మండిప‌డ్డారు. నిధులు తమవి ప్రచారాలు టీడీపీవి పథకాలు మీ కార్యకర్తలకా ఇదెక్కడి న్యాయమని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.