చంద్ర‌బాబు నీకు ద‌మ్ముందా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-09 13:12:24

చంద్ర‌బాబు నీకు ద‌మ్ముందా

తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ పూర్తిగా న‌ష్టాల్లో ఉంద‌ని తెలిసి కూడా ముఖ్య‌మంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విచ్చ‌ల విడిగా ప్ర‌జా ధనాన్ని ఖ‌ర్చు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ మండిప‌డ్డారు. హైద‌రాబాద్ లో అనేక ప్ర‌భుత్వ గెస్టౌస్ లు ఉన్నాయి వాట‌న్నంటిని వ‌దిలేసి మీరు మీ కుంటుంబాన్ని స్టార్ హోట‌ల్లో పెట్టి 30 కోట్ల‌ను ఖ‌ర్చు చేస్తున్నారు ఇది ఎంత‌వ‌ర‌కు న్యాయం అని ముఖ్య‌మంత్రికి లేఖ ద్వారా పేర్కొన్నారు.
 
తాను లేఖ‌లో పేర్కొన్న ప్ర‌శ్న‌ల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఖ‌చ్చితంగా స‌మాధానం ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. రాష్ట్రం అష్ట క‌ష్టాల్లో ఉంద‌ని అంద‌రికీ తెలుసు కానీ మీ ఖ‌ర్చు మీరే చెల్లించుకోవ‌చ్చు క‌దా అని క‌న్నా ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న మీరు ఇలా ఖ‌ర్చు చెయ్య‌డం ఎంత‌వ‌ర‌కు న్యాయ‌మో మీరే తెలుసుకోవాల‌ని ఆయ‌న ఆరోపించారు.
 
అంతేకాదు ఈ నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో జ‌ల‌వ‌న‌రుల శాఖ‌, నీటి పారుద‌ల శాఖ‌లో జ‌రిగిన వేలాది కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణంపై టీడీపీ నాయ‌కులు చ‌ర్చ‌కు సిద్దమా అని పేర్కొన్నారు. 40 వేల కోట్ల రూపాయ‌లు సాగునీటి ప్రాజెక్ట్ ల మీద వెచ్చించామ‌ని చెప్పే మీరు ఇందులో స‌గం క‌మీష‌న్ల రూపంలో, మీ జ‌ల‌వ‌న‌రుల శాఖ‌ మ‌రియు నీటి పారుద‌ల శాఖ‌ మంత్రి కొట్టెయ్య‌డం లేదా అని ప్ర‌శ్నించారు. 
 
నామినేష‌న్ పద్ద‌తి అనో కాస్ట్ ఎస్క్ లేష‌న్ అనో ఏదో ఒక మిష‌న్ తో మీరు మీ మంత్రి జ‌రిపిన అవినీతిపై విచార‌ణ‌కు సిద్ద‌మా అని క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ ప్ర‌శ్నించారు. తెల్ల‌వారి లేస్తే నిప్పు అని చెప్పుకునే మీరు  18 స్టేలను ఎందుకు తెచ్చ‌కున్నారో వాటిపై స‌మాధానం చెప్పే ధైర్యం ఉండ‌దు. అన్ని స్టేలు ఎలా వ‌చ్చాయే చెప్పే ద‌మ్ము కూడా ఉండ‌దు రాష్ట్రంలో ఉన్న అన్ని వ్య‌వ‌స్త‌ల మీద మీ మ‌నుషుల‌తో నింపి వారి ద్వారా వ్య‌వ‌స్త‌ను అనైతికంగా  ప్ర‌భావితం చేసి మీరు రాష్ట్రాన్ని బ్ర‌ష్టు ప‌ట్టించారు. 
 
బీసీ ఉద్యోగుల‌కు గత‌ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప్ర‌మోష‌న్లు రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌న‌డంతో పాటు వారి మొత్తం రిజ‌ర్వేష‌న్ల‌ను 33 1-3 శాతానికి పెంచుతామ‌ని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని మోసం చెయ్య‌లేదా అని క‌న్నా లేఖ ద్వారా పేర్కొన్నారు. అంతేకాదు రేయింబ‌వ‌ళ్లు బీసీల కోస‌మే పుట్టిన పార్టీ వారికోస‌మే ప్రాణాలు ఇస్తామ‌ని చెప్పే మీరు ఇంత‌వ‌ర‌కు వారికి పైన పేర్కొన్నవ‌న్ని ఎందుకు అమ‌లు చేయ్య‌లేదు అని ప్ర‌శ్నించారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.