విచార‌ణ‌కు బీజేపీ గ్రీన్ సిగ్న‌ల్ భ‌యంతో బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-16 16:13:57

విచార‌ణ‌కు బీజేపీ గ్రీన్ సిగ్న‌ల్ భ‌యంతో బాబు

అధికారంలో ఉండి కేంద్రం నుంచి అధిక నిధుల‌ను తీసుకుంటూనే భార‌తీయ జ‌న‌తా పార్టీని అలాగే ప్ర‌ధాని మోడీని దోషిగా నిల‌బెడుతున్న విష‌యాల‌ను తాను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు తీసుకువెళ్లున్నాన‌నే ఉద్దేశ్యంతో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న పై దాడి చేయిస్తున్నార‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ మండిప‌డ్డారు. ఈ రోజు డిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వ‌చ్చేఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌నే భ‌యంతో టీడీపీ నాయ‌కులు త‌న పై దాడి చేస్తున్నార‌ని క‌న్నా ఆరోపించారు. అయితే ఈ విష‌యాన్ని తాను కేంద్ర హోమంత్రి దృష్టికి ఈరోజు తీసుకు వెళ్లాన‌ని ఆయ‌న స్ఫ‌ష్టం చేశారు.
 
అయితే ఈ విష‌యంపై హోం మ‌త్రి సానుకూలంగా స్పందించార‌ని త‌నపై జ‌రిగిన‌ దాడిపై ఖ‌చ్చితంగా విచార‌ణ జ‌రిపిస్తాన‌ని విచార‌ణ‌ జ‌రిపించిన త‌ర్వాత త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటార‌ని  క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌న స్ప‌ష్టం చేశారు. తాను రాజ‌కీయ అరంగేట్రం చేసినప్ప‌టినుంచి ప్ర‌తిప‌క్షంలో ఉన్నాము అధికారంలో ఉన్నామ‌ని కానీ ఆంధ్ర‌రాష్ట్రంలో ఇటువంటి అరాచ‌క‌మైన పాల‌న తాను ఎప్పుడు చూడ‌లేద‌ని, కేవ‌లం ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో చూస్తున్నామ‌ని క‌న్నా తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. 
 
అయితే ఈ దాడుల‌ను బీజేపీ త‌రుపున‌ ఖండిస్తున్నామ‌ని 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో  ప్ర‌జ‌లు ఖ‌చ్చితంగా టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి బుద్ది చెబుతార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార నాయ‌కుల ప‌రిపాల‌న‌పై ఎవ‌రు ప్ర‌శ్నించినా, ఎదురు తిరిగినా వారిమీద కేసులు పెడుతున్నార‌ని క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.