చంద్ర‌బాబు ఒక ఊస‌ర‌వెల్లి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu and kanna lakshmi narayana
Updated:  2018-09-10 12:45:22

చంద్ర‌బాబు ఒక ఊస‌ర‌వెల్లి

జాతీయ కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు తెలుగు వారికోసం తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే దానిని తుంగ‌లో తొక్కి ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అదే పార్టీతో దోస్తి అయ్యేందుకు సిద్ద‌మ‌య్యార‌ని బీజేసీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ మండిప‌డ్డారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్య‌క్తి చంద్ర‌బాబ నాయుడు అని ఆయ‌న తీవ్ర‌స్థాయిలో ద్వ‌జ‌మెత్తారు.
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో చంద్ర‌బాబు క‌లిసి బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అవ‌స‌రాల‌ను బ‌ట్టి చంద్ర‌బాబు నాయుడు ఊసరవెల్లిలా మారుతార‌ని, అయ‌న‌కు అనుకూలంగా ఉన్న పార్టీ నేత‌లు ఎలాంటివారితో అయినా దోస్తీ చేస్తార‌ని ఆరోపించారు. తెలుగుదేశం అంటేనే దొంగ‌ల పార్టీ అని  పార్టీలో ఉన్న నాయ‌కులు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ అన్ని వీరే కాబట్టి ఏరోజుఏ డ్రామా వేస్తారో తెలియ‌ద‌రి క‌న్నా ఎద్దేవా చేశారు.
 
 ఈ డ్రామాలో భాగంగానే టీడీపీ నాయ‌కులు ఒక్కొక్క వేశంతో ప్ర‌జ‌ల ముందుకు అవాస్త‌వాల‌ను తీసుకువేళ్తున్నార‌ని ఆరోపించారు. గ‌తంలో లాగా ఆంధ్ర రాష్ట్ర విభ‌జ‌న‌కు సంత‌కం చేసి జై స‌మైఖ్యంధ్రా అన్నారో ఇప్పుడు కూడా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాలంటూ దొంగ ప్ర‌చారాలు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు స‌