ఆ కంపెనీ మీ వియ్యంకుడు బాల‌య్య‌కు చెందిన‌ది కాదా బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

kanna lakshmi narayana and balakrishna
Updated:  2018-09-19 12:32:54

ఆ కంపెనీ మీ వియ్యంకుడు బాల‌య్య‌కు చెందిన‌ది కాదా బాబు

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న ప‌రిపాల‌న‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి ప్ర‌తీ వారం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నాల‌క్ష్మీనారాయ‌ణ‌లేఖ ద్వారా ప్ర‌శ్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే క్ర‌మంలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ మ‌రో ఐదు ప్ర‌శ్న‌ల ద్వారా ముఖ్యంత్రి చంద్ర‌బాబును సందించారు.
 
1 వ్య‌వ‌సాయ రుణాల‌పై బ్యాంకుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం చెల్లించవ‌ల‌సిన స‌బ్సిడీ వ‌డ్డి వాట విడుద‌ల గ‌త నాలుగు నెల‌ల‌నుంచి విడుద‌ల చేయ‌కుండా పేద రైతుల వ‌డ్డీని విరుస్తున్న మాట వాస్త‌వం కాదా! 
 
బ్యాంకు ప‌నుల‌ను  7 శాతం వ‌డ్డితో కేంద్రం త‌న 3 శాతం వ‌డ్డీని చెల్లిస్తూ ఉండ‌గా, రాష్ట్ర ప్ర‌భుత్వం చెల్లించాల్సిన త‌న 4 శాతం వ‌డ్డీ వాటాను గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌నుంచి చెల్లించ‌వ‌ల‌సిన మాట వాస్త‌వం కాదా ! ఇందువ‌ల‌న బ్యాంకులు ఆ వ‌డ్డీ మొత్తాన్ని పేద రైతుల‌నుంచి చెవులు పించ‌డి వ‌సులు చేస్తున్న మాట వాస్త‌వం కాదా! దీని కార‌ణంగా బ్యాంకులు పేద రైతుల‌కు నోటీసుల‌ను ఇచ్చి ఇబ్బందుల‌పాలు చేస్తున్న వాస్త‌వం కాదా ! ఈ మొత్తాన్ని బ్యాంకుల‌కు చెల్లించి పేద రైతుల‌కు ఎప్పుడు ఊర‌ట క‌లిగిస్తారు. ఈ మొత్తం వైఫ‌ల్యాల‌పై స్వేత ప‌త్రాన్ని విడుద‌ల చేసి పేద ప్ర‌జ‌ల‌కు ధైర్యాన్ని క‌లుగ‌చేస్తారా!
 
2.పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్శిస్తున్నాయ‌ని మీ ప్ర‌భుత్వం చేస్తున్న భూ కేటాయింపుల‌లో మీకు, మీ కుమారుడికి ముడుపులు ముట్ట‌లేద‌ని చెప్ప‌గ‌ల‌రా !
 
పారిశ్రామికంగా ఎంతో ప్రాధాన్య‌త గ‌ల విశాఖ ప‌ట్నంలోని మ‌ధుర‌వాడ ప్రాంతంలో మీ కుమారుడుకి మిత్రుడు అయిన జీ శ్రీధ‌ర్ రాజుల‌కు సంబంధించిన ఈ- సెంట్రిక్ సొల్యూష‌న్ కు 360 కోట్ల రూపాయ‌లు విలువైన భూమిని కేవ‌లం 25 కోట్ల‌కు మాత్ర‌మే దారద‌త్తం చేయ‌డం వాస్త‌వం కాదా ! జిల్లా క‌లెక్ట‌ర్ సీ.సీ.య‌ల్ మ‌రియు ఏపీ లాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ఏపీ.య‌ల్ . యం. ఏలు అన్ని స‌ర్వే నంబ‌ర్ 409లో ఉన్న ఈ భూమికి ఎక‌రం విలువ‌గా 7.26 ల‌క్ష‌లు నిర్ణ‌యిస్తే మీ ఆద్వ‌ర్యంలో దానివిలువ 50 ల‌క్ష‌ల‌కు విదించ‌లేదా ! ఇందులో మీకు మీ కుమారికి ముడుపులు అంద‌లేదా చెప్పండి..! ఈ భూముల‌పై సీబీఐకు సిద్ద‌మా !
 
కృష్ణా జిల్లా జ‌గయ్య‌పేట మండ‌లం జ‌యంతిపురం గ్రామంలో స‌ర్వే నంబ‌ర్ 93 లోని 499 ఎక‌రాల కోట్లాది రూపాయ‌ల విలువైన భూమిని కారు చౌక‌గా ఫ‌ర్టీ లైజ‌ర్స్ అండ్ కెమిక‌ట్ లిమిటెడ్ ధార‌త్తం చేయ‌లేదా! ఆ కంపేనీ మీ బావ‌మ‌రిది, హిందుపూరం ఎమ్మెల్యే బాల‌కృష్ణ వియ్యంకునికి చెందిన‌ది కాదా ! కేటాయింపులో అవ‌కత‌వ‌క‌లు జ‌రుగ‌లేద‌ని శ్వేత ప‌త్రం విడుద‌ల చేయ‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు.
 
కేంద్రం రాష్ట్రానికి  విద్యాసంస్థ‌లు ఇవ్వ‌డం లేద‌ని చెబుతున్న మీరు 2016 డిసెంబ‌ర్ కేంద్ర మంత్రులు శంకుస్థాప‌న చేసిన ఎస్ సీఈఆర్ టీకి భూమి ఎందుకు కేటాయించలేదో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ ప్ర‌శ్నించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.