చంద్ర‌బాబు మోస‌కారి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-12 17:35:58

చంద్ర‌బాబు మోస‌కారి

2014లో భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రానికి వేల కోట్ల నిధుల‌ను కేటాయించింద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. ఈ రోజు విశాఖ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జరిగిన త‌ర్వాత కేంద్రం ఏ రాష్ట్రానికి కేటాయించ‌ని నిధుల‌ను ఏపీకి కేటాయించింద‌ని అయన అన్నారు.
 
ఈ రోజు రాష్ట్రంలో ఎక్క‌డైనా అభివృద్ది కార్య‌క్ర‌మం శంకుస్థాప‌నలు జ‌రుగుతున్నాయంటే అది కేవ‌లం కేంద్ర ప్ర‌భుత్వం కేటాయించిన నిధుల వ‌ల్లే అని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. నిన్న పోల‌వ‌రం ప్రాజెక్ట్ ప‌నుల ప‌రిశీల‌న‌కు కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ వ‌చ్చార‌ని అలాగే గుంటూరులో ఎయిమ్స్ ప‌రిశీల‌న‌కు కేంద్ర మంత్రులు కూడా వ‌స్తార‌ని ఆయ‌న స్ఫ‌ష్టం చేశారు. కేంద్రం అభివృద్ది కోసం కేటాయిస్తున్న నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటూనే వారు మ‌ళ్లీ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తోంద‌నే అబ‌ద్ద‌పు ప్ర‌చారం చేస్తున్నార‌ని క‌న్నా మండిప‌డ్డారు. సాయం చేసిన చేతుల‌ను న‌ర‌క‌డం చంద్ర‌బాబు నైజం అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.
 
నాటి నుంచి నేటి వ‌ర‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి వెన్నుపోటు పోడ‌వ‌టం కొత్తేమి కాద‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ విమ‌ర్శ‌లు చేశారు. విభ‌జ‌న జ‌రిగిన తర్వాత 2014లో మోడీ ఏపీలో ప‌ర్య‌టించి విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల‌ను నెర‌వేర్చ‌డం త‌న బాధ్య‌త‌ అని హామీ ఇచ్చారో దానికి అనుకూలంగా రాష్ట్రానికి సంపూర్ణంగా నిధుల‌ను ఇచ్చారని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.