ఆయ‌న చావుకు బాబే కారణం..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-11-03 12:11:46

ఆయ‌న చావుకు బాబే కారణం..

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాజకీయాలు ఊస‌ర‌వెల్లి సిగ్గుప‌డేలా ఉన్నాయ‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆరోపించారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ గ‌తంలో టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావుపై చెప్పులు వేయించి ఆయ‌న చావుకు చంద్ర‌బాబు కార‌ణం అయ్యార‌ని, ఇప్పుడు ఆయ‌న ఫోటోకు దండ‌వేసి ప్ర‌చారం చేయం దారుణం అని కన్నా అన్నారు.
 
2014 ఎన్నిక‌ల్లో బీజేపీతో పోత్తుపెట్టుకున మోడీని దేవుడు అని ప్ర‌చారం చేసిన‌ చంద్ర‌బాబు ఇప్పుడు అదే బీజేపీతో పెట్టుకున్నందుకు చారిత్ర‌క త‌ప్పిదం చేశామ‌ని త‌న అనుకూల మీడియాలో ప్ర‌చారం చేయ‌డం సిగ్గు చేట‌ని క‌న్నా తెలిపారు. అంతేకాదు 2018లో మోడీని ద్రోహి అన్నార‌ని క‌న్నా ఆరోపించారు. స్వార్థ రాజ‌కీయాల కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఏస్థాయికి అయినా దిగ‌జారుతార‌ని గ‌తంలో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీని ఇట‌లీ ద‌య్యం అని ఆమెకు డ‌బ్బుపిచ్చి ప‌ట్టింద‌ని అనేక‌సార్లు చెప్పార‌ని ఆయ‌న గుర్తు చేశారు. 
 
అంతేకాదు చంద్ర‌బాబు నాయుడు భార‌త దేశాన్ని తిప్పుతున్నార‌ని ఎల్లో మీడియా వార్త‌లు రాయ‌డం విడ్డూరంగా ఉంద‌ని క‌న్నా అన్నారు. రాష్ట్రంలో అవ‌కాశ రాజ‌కీయాలు పెరిగాయ‌ని 2019లో మోడీని మ‌రోసారి ప్ర‌ధానిని చేస్తే దేశం అభివృద్ది ప‌దంలో దూసుకుపోతుంద‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అన్నారు.