టీడీపీ నాయ‌కులు పందికొక్కులు.. క‌న్నా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-07 18:54:52

టీడీపీ నాయ‌కులు పందికొక్కులు.. క‌న్నా

తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌ష్టాల్లో ఉంద‌ని ప్ర‌ధాని మోడీ ల‌క్ష‌న్న‌ర కోట్ల నిధుల‌ను రాష్ట్రానికి కేటాయిస్తే దాన్ని అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు పందికొక్కుల్లా మెక్కెశార‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ మండిప‌డ్డారు.
 
ఈ రోజు క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించిన ఆయ‌న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2014లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏ రాష్ట్రానికి కేటాయించ‌ని విధంగా మోడీ ఏపీకి నిధులు కేటాయించార‌ని కానీ టీడీపీ నాయ‌కులు ఆ నిధుల‌ను దొడ్డిదారి మ‌ళ్లించి అక్ర‌మంగా దోచుకున్నార‌ని క‌న్నా విమ‌ర్శించారు. 
 
అలాగే రైతుల‌కు ఎన్న‌డులేని విధంగా బీజేపీ ప్ర‌భుత్వం 14 పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర ప్ర‌క‌టించింద‌ని స్ప‌ష్టం చేశారు. టీడీపీ నాయ‌కులు ప్ర‌క‌టించిన ప‌థ‌కాల‌న్ని కేవ‌లం ఎమ్మెల్యేల కోసం టీడీపీ కార్య‌క‌ర్త‌ల కోసం ఏర్పాటు చేసుకున్న‌వే అని ఆయ‌న మండిప‌డ్డారు. ఏ ప్ర‌భుత్వంలో లేని విధంగా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల బంగారాన్ని బ్యాంకు మేనేజ‌ర్లు వేలం వేస్తుంటే ఏపీ స‌ర్కార్ సైలెంట్ గా ఉంద‌ని క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌ ఆరోపించారు. క‌డ‌ప అభివృద్ది కోసం మోడీ పెద్ద పీట‌వేశార‌ని, విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన స్టీల్ ప్లాంట్ గురించి చ‌ట్టప‌రంగా ప‌రిశీలిస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 
 
బీజేపీతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మిత్రప‌క్షంగా వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడు స్టీల్ ప్లాంట్ నిర్మాణ విష‌యం గురించి తాము మాట్లాడితే అస‌లు ఆయ‌న ప‌ట్టించుకోలేదని ఇక్క‌డ‌ ప్లాంట్ నిర్మాణానికి అనువైన ప్లేస్ కాద‌ని టీడీపీ నాయ‌కులు వివ‌రించార‌ని అయ‌న గుర్తు చేశారు. ఇక ఇదే విష‌యంపై బీజేపీ మెకేన్‌ ఆధ్వర్యంలో కమిటీ వేశామని కానీ అందుకు సంబంధించిన ఆధారాలు చంద్ర‌బాబు ఇవ్వ‌కుండా చేశార‌ని మండిప‌డ్డారు. ఇక ఈ త‌ప్పు ఎక్క‌డ త‌న‌మీద ప‌డుతుందోన‌ని భ‌య‌ప‌డి దీక్ష‌ల పేరుతో దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ విమ‌ర్శ‌లు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.