క‌న్నా క్ష‌మాప‌ణ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

kanna lakshmi narayana
Updated:  2018-09-20 11:50:40

క‌న్నా క్ష‌మాప‌ణ‌

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతున్న క్ర‌మంలో ప్ర‌జ‌ల వ‌ద్ద‌నుంచి సానుభూతి పొందేందుకు ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు బాబ్లీ ప్రాజెక్ట్ డ్రామాని తెర‌పైకి తీసుకు వ‌చ్చార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నాల‌క్ష్మీనారాయ‌ణ మండిప‌డ్డారు. తాజాగా కాకినాడ‌ పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ బాబ్లీ కేసుకు సంబంధించిన వారెంట్లు సుమారు 2015 నుంచి వ‌స్తున్నాయ‌ని ఆయ‌న గుర్తు చేశారు. 
 
అయితే తాజాగా తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో ఆ నెపాన్ని బీజేపీపై నెట్టి సానుభూతి పొందాల‌ని చూస్తున్నార‌ని క‌న్నా మండిప‌డ్డారు. చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో త‌న ప‌లుకుబ‌డి కోసం తానే నాన్ బెయిల్ వారెంట్ ఇప్పించుకుని డ్రామాలు ఆడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 
ఇక ఈ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతున్న స‌మ‌యంలో మీడియా ప్ర‌తినిధులు రిపోర్ట్ ను క‌వ‌ర్ చేసేందుకు చేరుకోగా వెళ్ల‌గా అక్క‌డ ఉన్న బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు విలేక‌ర్ల‌తో వాగ్వాదానికి దిగారు. తాము న్యూస్ క‌వ‌ర్ చేసేందుకు కూర్చోవ‌డానికి కుర్చీలు కావాల‌ని కోరారు. దీంతో ఆగ్ర‌హించిన బీజేపీ నాయ‌కులు స‌మావేశం జ‌రుగుతుంటే మీ గొడ‌వేంట‌ని ఇష్టం ఉంటే ఉండండి లేదంటే వెళ్లిపోండ‌ని అని వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో మ‌రో బీజేపీ నాయ‌కుడు విటేక‌ర్ల‌పై డాడి చేశారు. దీంతో అక్క‌డ ప‌రిస్థితి ఉద్రిక్తం కావ‌డంతో వెంట‌నే క‌న్నా అక్క‌డ‌కు చేరుకుని మీడియాకు క్ష‌మాప‌ణ‌ చెప్పారు. దీంతో ఈ వివాదం కాస్త చ‌ల్ల‌బ‌డింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.