క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-09 14:49:09

క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ సంచ‌ల‌న నిర్ణ‌యం

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుపరిచిన ప్ర‌త్యేక హోదా ప్ర‌స్తావన‌ గురించి గ‌తంలో కేంద్రం ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుని అడిగితే త‌మ‌కు ప్ర‌త్యేక హోదా వ‌ద్ద‌ని ప్ర‌త్యేక ప్యాకేజీ కావాల‌న్నార‌ని భార‌తీయ జ‌నతా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ గుర్తు చేశారు. ఈ రోజు క‌డ‌ప‌ జిల్లా బ‌ద్వేలులో ప‌ర్య‌టించిన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో చంద్ర‌బాబు నాయుడు యూట‌ర్న్ తీసుకుని ఇప్పుడు ప్ర‌త్యేక హోదా కావాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష‌ల పేరు చెప్పి దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని క‌న్నా తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు. 
 
కేంద్రం ఏపీని అభివృద్ది చేసే విష‌యంలో క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే చంద్ర‌బాబు నాయుడు కేవ‌లం త‌న‌ స్వ‌లాభం కోసం దిగ‌జారుడు కార్య‌క‌లాపాలు చేస్తున్నార‌ని క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అగ్రిగోల్డ్‌ మాఫియా వ్య‌వ‌హారంలో బాధితుల‌ను ఆదుకోవాల‌ని కేంద్రం నుంచి చంద్ర‌బాబు నాయుడుకి లేఖ రాస్తే దానిని ప‌ట్టించుకోలేద‌ని మండిప‌డ్డారు. 
 
అందుకే తాము ఒక నిర్ణ‌యానికి వ‌చ్చామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అగ్రిగోల్డ్ బాధితుల ప‌క్షాన ఒక రోజు ధ‌ర్నా కార్య‌క్ర‌మం చేయ‌నున్నామ‌ని రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ స్పష్టం చేశారు. దేశంలో ఎన్న‌డూ లేని విధంగా 2014లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రైతుల‌కు 14 పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర ప్ర‌క‌టించిన ఘ‌న‌త‌ ప్ర‌ధాని మోడీద‌ని తెలిపారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.