బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌హ‌స్యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-22 18:33:42

బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌హ‌స్యం

ఒక వైపు వైసీపీలో చేరడానికి కన్నా ముహూర్తం ఫిక్స్ చేసుకుని, జగన్ సమక్షంలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరో వైపు టీడీపీ నుండి  కూడా బారి ఆఫర్ వచ్చింది. అదే సమయంలో బీజేపీ పెద్దల నుండి కూడా ఒత్తిడి వచ్చింది. ఇన్ని పరిణామాల మధ్య అనూహ్యంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు కన్నా లక్ష్మి నారాయణ.
 
కన్నా లక్ష్మి నారాయణ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.చంద్రబాబు ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించలేదని, కేవలం తన స్వార్ధ రాజకీయాలే చూసుకుంటారని అన్నారు.
 
చంద్రబాబు ఇప్పటి వరకు సుమారు 29 సార్లు ఢిల్లీకి వెళ్లారని, అందులో మెజారిటీ శాతం జగన్ ను జైలుకి పంపించమని అడగడానికి మాత్ర‌మే వెళ్లేవారని, దానితో పాటు నియోజకవర్గాలను పెంచాలని ఒత్తిడి చేశారే తప్ప..రాష్ట్రంలో ఉన్న ఏ ఇతర సమస్యలపైనా మాట్లాడలేదని అన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ...
 
నేను నిప్పు, 26 గంటలు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పాటుపడుతున్నానని చెప్పే చంద్రబాబు, ఇలాంటి నీచరాజకీయాల‌ కోసమే ఢిల్లీకి వెళ్లి మోడీని కలుస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నాయకులు.చంద్రబాబు స్టేలు తెచ్చుకున్న 18 కేసులలో ఏ ఒక్కదానిపైన విచారణ జరిగిన చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని ఎద్దేవా చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.