రాజ‌కీయం కోసం ఆ గుండెను వాడుకోవ‌ద్దు క‌న్నా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-12 15:19:32

రాజ‌కీయం కోసం ఆ గుండెను వాడుకోవ‌ద్దు క‌న్నా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌లకు పోలవ‌రం ప్రాజెక్ట్ గుండె లాంటిద‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. అయితే ప్ర‌స్తుతం అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అంతేకాదు 2014లో బీజేపీ అధికాంలోకి వ‌చ్చిన త‌ర్వాత పోల‌వ‌రం ప్రాజెక్ట్ కు సంబంధించిన నిధుల‌న్ని స‌మ‌కూర్చామ‌ని ఏపీకి ఒక్క రూపాయి కూడా బాకీ లేద‌ని క‌న్నా ల‌క్ష్మీనాయ‌రాయ‌ణ స్ప‌ష్టం చేశారు. 
 
పొల‌వరం ప్రాజెక్ట్ వ్య‌వ‌హారంలో రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే కాంట్రాక్ట‌ర్ల  మ‌ధ్య స‌మ‌న్వ‌యక‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని క‌న్నా అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయ‌డం బీజేపీ కీల‌క బాధ్య‌త‌ల‌ను తీసుకుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కేంద్రం నిర్మిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్ట్ లో రాష్ట్ర నాయ‌కులు పెత్త‌నం ఏంట‌ని క‌న్నా ప్ర‌శ్నించారు.
 
అలాగే విభ‌జ‌న చట్టంలో పొందుప‌రిచిన అంశాల‌పై కూడా ఆయ‌న స్పందించారు.. తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఏపీ న‌ష్టాల్లో ఉంద‌ని అందుకే కేంద్రం ఏపీపై ప్ర‌త్యేక దృష్టి సారించింద‌ని క‌న్నా పేర్కొన్నారు. గతంలో తాము ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టిస్తామ‌ని చెబితే అప్పుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక ప్యాకేజీకి జై కొట్టార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.