వైసీపీలో చేర‌డంపై బాపిరాజు క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-22 15:03:54

వైసీపీలో చేర‌డంపై బాపిరాజు క్లారిటీ

ఎన్నిక‌ల స‌మ‌రానికి ఇంకా ప‌దినెల‌ల స‌మయం ఉన్న నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయ నాయ‌క‌లు రోజుకొక రంగుపూసుకుని వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒక వైపు అధికార తెలుగు దేశంపార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చి చ‌రిత్ర‌ను సృష్టించాల‌నే ధృడ సంక‌ల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా స‌భ‌ల‌ను ఏర్పాటు చేసి ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో టీడీపీ ఏ విధంగా అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేశారో స‌భాముఖంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. 
 
ఇక మ‌రో వైపు ప్ర‌తిప‌క్ష వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తేనే రాజ‌కీయ మ‌నుగ‌డ ఉంటుంద‌నే ఉద్దేశ్యంతో ఎర్ర‌ని ఎండ‌ల‌ను సైతం లెక్క చేయ‌కుండా ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌ను చేస్తున్నారు. 
 
అయితే ఈ సంక‌ల్స‌యాత్ర‌కు అధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతుండ‌టంతో వ‌చ్చేఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా వైసీపీనే అధికారంలోకి వ‌స్తుందని భావించి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు, అలాగే కాంగ్రెస్ లో ఉన్న సీనియ‌ర్ నాయ‌కులంద‌రూ క‌లిసి పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు. ఇక ఇదే క్ర‌మంలో న‌ర‌సాపురం మాజీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మ‌న్ బాపిరాజు కూడా వైసీపీలో చేరుతారంటూ వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అంతే కాదు ఇదే నియెజ‌కవ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాపిరాజు వైసీపీ త‌ర‌పున పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 
 
అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై బాపిరాజు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ఈ విష‌యంపై స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తాను ఎటవంటి ప‌రిస్థితిలో వైసీపీలోకి వెళ్ల‌న‌ని, త‌న‌కు రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని త‌న ప్రాణం ఉన్నంత వ‌ర‌కూ వ‌దిలేది లేద‌ని అన్నారు. అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధిష్ఠానం టిక్కెట్‌ ఇస్తే  న‌ర‌సాపురం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తన రాజకీయం జీవితం కాంగ్రెస్ తోనే ముగుస్తుందన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.