జ‌గ‌న్ కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్న కాపులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-22 15:06:09

జ‌గ‌న్ కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్న కాపులు

తెలుగుదేశం గ‌త ఎన్నిక‌ల్లో ముఖ్యంగా 2014 ఎన్నిక‌ల ప్రచారంలో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లను ఇస్తామ‌ని బీసీల్లో క‌లుపుతామ‌ని చెప్పింది.. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గ‌డిచినా త‌మ హామీ నెర‌వేర్చ‌లేదంటూ కాపులు ఎదురుతిర‌గ‌డంతో కాపుల పై అణిచివేత చ‌ర్య‌లు మొద‌ల‌య్యాయి.. అలాగే కాపుల‌పై విరుచుకుప‌డ్డారు తెలుగుదేశం నాయ‌కులు..ఇక గ‌డిచిన ఏడాది కాలంగా కాపుల పై మ‌రింత కేసులు పెట్ట‌డం అలాగే ముద్ర‌గ‌డ‌పై అభాండాలు వేయ‌డం జ‌రిగింది.
 
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాపులు తెలుగుదేశం పై విముఖ‌త చూపుతున్నారు.. కాపు అంటే కేరాఫ్ అడ్ర‌స్ గా చెపుతారు తూర్పు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల‌ను.. త‌ర్వాత ఉత్త‌రాంధ్రా జిల్లాలో కాపుల ప్రాబ‌ల్యం ఉంది..ఆ త‌ర్వాత రాయ‌సీమ‌లోని ప్రాంతాలు.. అయితే ఇప్పుడు జ‌గ‌న్ పాదయాత్ర తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే..
 
తూగోలో కాపు సెగ్మెంట్లు ఎక్కువ, కాపు నాయ‌కులు ఎక్కువే, గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం కంటే వైసీపీ కాపుల‌కు ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఇచ్చింది. అయినా కాపుల రిజ‌ర్వేష‌న్ అంశంతో తెలుగుదేశం అధినేత విజ‌యం సాధించారు. ఆహామీని న‌మ్మి గంపగుత్తిగా తెలుగుదేశం పార్టీకి నాయ‌కుల‌కు  అంద‌రూ ఓట్లు వేశారు. 
 
ఇక తెలుగుదేశం పార్టీ అధినేత, కాపుల‌కు  ఇచ్చిన హామీ నెర‌వేర్చ‌కుండా, బిల్లును అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టి కేంద్రానికి పంపించాం.. కేంద్రం చేతుల్లో ఉంది అని చెప్ప‌డంతో, ఇప్పుడు కాపులు మ‌రింత ఆగ్ర‌హాంగా ఉన్నారు.. అయితే ఇటు మండ‌పేట‌, రాజోలు, తుని, పిఠాపురం, అన‌ప‌ర్తి, అన‌కాప‌ల్లి, రాజ‌మండ్రి, రాజాన‌గ‌రం,అమ‌లాపురం ఈ ఏరియాల్లో కాపు ఓట్లు బ‌లంగా ఉన్నాయి.. జ‌గ‌న్ పాద‌యాత్ర కూడా ఇక్క‌డ స‌క్సస్ చేసేందుకు ఇక్క‌డ వైసీపీ శ్రేణులు కూడా మంచి ప్ర‌ణాళిక‌తో వెళుతున్నారు.
 
ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ పాద‌యాత్ర ప‌శ్చిమ‌లో పూర్తి అయిన ప్రాంతాల్లో జ‌గ‌న్ కు చాలా పాజిటీవ్ వేవ్స్ వ‌చ్చాయి.. ముఖ్యంగా జ‌గ‌న్ కు ఇక్క‌డ కాపుల నుంచి ప్ర‌శంస‌లు అందాయి...ఇటు పీకే టీమే కాదు, జిల్లా వైసీపీ శ్రేణులు ప‌లు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించినా, ఓ అవ‌కాశం జ‌గ‌న్ కు ఇచ్చిచూస్తాం అని అంటున్నారు. ముఖ్యంగా కాపు యువ‌త‌లో ఎంతో మార్పు వ‌చ్చింది అనేది తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.