కాపుల రిజర్వేషన్.. జగన్‌కు మరింత మద్దతు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-06 16:59:28

కాపుల రిజర్వేషన్.. జగన్‌కు మరింత మద్దతు

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా మొన్న జ‌గ్గంపేట‌లో కాపుల‌ రిజ‌ర్వేష‌న్ల‌పై ప్ర‌స్తావించిన సంగ‌తి తెలిసిందే. రిజ‌ర్వేష‌న్ల‌ది కేంద్ర ప‌రిధిలో ఉన్న అంశం కాబ‌ట్టి తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తాన‌ని ఖ‌చ్చితంగా చెప్ప‌లేన‌ని కానీ తాను కాపుల‌కు వ్య‌తిరేకం కాద‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎంత‌మేర‌కు కాపు కార్పోరేష‌న్ సంఘాల‌కు నిధుల‌ను కేటాయిస్తున్నారో తాను అంత‌కంటే రెండింత‌ల నిధుల‌ను కేటాయిస్తాన‌ని చెప్పారు.
 
కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై జ‌గ‌న్ క్లారిటీ ఇవ్వ‌డంతో ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు వైసీపీకి దూరం అవుతార‌ని తెలుగుదేశం అనుకూల మీడియా, టీడీపీ వ‌ర్గాలు విస్రృత స్థాయిలో ప్ర‌చారం చేశారు. అయితే వారు ఎంత మేర‌కు ప్ర‌చారం చేసినా కూడా జ‌గ‌న్ మాత్రం భ‌య‌ప‌డ‌లేదు. తాను ప్ర‌క‌టించినది న్యాయ బ‌ద్ద‌మైన‌ది కాబ‌ట్టి చివ‌రికు న్యాయ‌మే గెలుస్తుంద‌ని భావించి పాద‌యాత్ర‌లో ముందుకు సాగుతున్నారు. 
 
ఇక కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై కాస్త ఆలోచించిన ఆ సామాజిక నేత‌లు జ‌గ‌న్ ప్ర‌క‌టించిన‌ది న్యాయ‌బ‌ద్ద‌మైన‌ద‌ని భావించి అనేక కాపు సంఘాల వాళ్లు జగన్ ను కలిసి తమ మద్దతును కూడా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి వైసీపీ వైపు ఉన్న కాపులు దూరం అయ్యేదేమీ లేదని స్పష్టం అవుతోంది.
 
ఇక తాజాగా ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు స్పందించారు. కొద్దిరోజుల క్రితం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాపుల‌పై ప్ర‌క‌టించిన హామీ న్యాయ‌మైన‌దే అని ఆయ‌న అన్నారు. అయితే తెలుగు దేశం పార్టీ నాయ‌కులు ఇదే విష‌యాన్ని ఆస‌రాగా చేసుకుని వారు చేసిన త‌ప్పును క‌ప్పి పుచ్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని మోత్కుప‌ల్లి మండిప‌డ్డారు. 
 
కులాల మ‌ధ్య  చిచ్చు పెట్ట‌డం టీడీపీ నాయ‌కుల‌కు కొత్తేమి కాద‌ని గ‌తంలో ఎస్సీల మ‌ధ్య చిచ్చుపెట్టి రాజ‌కీయ ల‌బ్దిపొందార‌ని ఇక ఇప్పుడు కాపుల మ‌ధ్య చిచ్చు పెట్టి మ‌రోసారి రాజ‌కీయ ల‌బ్ది పొందేందుకు టీడీపీ నాయ‌కులు కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. బీసీల‌కు అన్యాయం చెయ్య‌కుండా కాపుల‌కు జ‌గ‌న్ న్యాయం చేస్తున్నార‌ని మోత్కుప‌ల్లి ప్ర‌శంశ‌లు కురిపించారు. గత ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని కాపు ఓట్ల‌తో గెలిచిన చంద్ర‌బాబు నాయుడుకు వ‌చ్చే ఎన్నికల్లో ఇదే కాపులు త‌గిన బుద్ది చెబుతార‌ని మోత్కుప‌ల్లి ఆరోపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.