బాబు అండ కుల‌స్థులు జ‌గ‌న్ కు ఘ‌నస్వాగ‌తం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-07-31 06:22:30

బాబు అండ కుల‌స్థులు జ‌గ‌న్ కు ఘ‌నస్వాగ‌తం

2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుంచి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న పార్టీ ఎమ్మెల్యేలు విచ్చ‌ల‌విడిగా అవినీతి అక్ర‌మాలకు పాల్ప‌డుతున్నార‌ని ప్ర‌తిప‌క్షనేత‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ మండిప‌డ్డారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం టీడీపీ నాయ‌కులు కంచుకోట తూర్పు గోదావ‌రి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతుంది. ఇక ఈ పాదయాత్ర‌లో జ‌గన్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చెయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక పాద‌యాత్ర‌లో భాగంగా మొన్న జ‌గ్గంపేట సాక్షిగా తాను కాపుల‌కు అండ‌గా నిలుస్తాన‌ని, ప్ర‌స్తుతం టీడీపీ నాయ‌కులు కాపు కార్పోరేష‌న్ కు ఎంత‌మేర‌కు నిధుల‌ను కేటాయిస్తున్నారో తాను అంత‌కు రెండు రెట్లు ఎక్కువ నిధుల‌ను వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ త‌ర్వాత కేటాయిస్తామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.
 
ఇక ఆయ‌న ప్ర‌క‌టించిన హామీల‌కు కాపులు ఆక‌ర్షితులు అయి వైసీపీ నాయ‌కులు పిఠాపురంలో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో కాపు సంఘాల‌ నాయ‌కులు ఫ్ల‌కాడ్స్ ప‌ట్టుకుని... కాపు కార్పోరేష‌న్ కి జ‌గ‌న్ ప‌దివేల కోట్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించినందుకు ఆయ‌న‌ను హృద‌య పూర్వ‌కంగా ఆహ్వానిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.