టీడీపీ దాష్టికం వైసీపీ నేత హౌస్ అరెస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-15 01:41:29

టీడీపీ దాష్టికం వైసీపీ నేత హౌస్ అరెస్ట్

ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లా రాజ‌కీయం కాక‌మీద ఉంది. రాయ‌దుర్గం వేదిక‌గా రాజ‌కీయ వేడి రాజుకుంది. ఈ క్ర‌మంలో టీడీపీ వైసీపీల వ‌ధ్య స‌వాళ్లు ప్ర‌తి స‌వాళ్లతో నియోజ‌క‌వ‌ర్గం అట్టుడికి పోతుంది. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి కాలువ శ్రీనివాసులు, వైసీపీ నేత రామ‌చంద్రారెడ్డి మ‌ధ్య కొద్దికాలంగా సాగుతున్న మాట‌ల యుద్దం తీవ్ర‌స్థాయికి చేరుకుంది.
 
అభివృద్ది, అవినీతిపై ఇద్ద‌రు నేత‌లు విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌లతో హోరెత్తిస్తున్నారు. ఈ క్ర‌మంలో భ‌హిరంగ స‌భ‌లోనే తేల్చుకుందామంటూ స‌వాల్ చేసుకున్నారు. అంతేకాదు ఇవాల చ‌ర్చ‌కు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక ఈ డిబెట్ కు నిరాక‌రించిన పోలీసులు వైసీపీ నేత కాపు రామ‌చంద్రారెడ్డిని అరెస్ట్ చేసి న‌గ‌రంలో 144 సెక్ష‌న్ విధించారు. 
 
2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ వేడి ఊపు అందుకుంది. కొద్దిరోజులుగా టీడీపీ వైసీపీ మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ న‌డుస్తోంది. అదికార‌ పార్టీకి చెందిన మంత్రి శ్రీనివాస్, వైసీపీకి చెందిన రామచంద్రారెడ్డి విమ‌ర్శ‌లు తారా స్థాయికి వెళ్లాయి. అయితే చివర‌కు అవి దారి త‌ప్పి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసుకునే ద‌శ‌కి కూడా వెళ్లిపోయాయి. 
 
అయితే ఇదంతా ప‌థ‌కం ప్ర‌కార‌మే టీడీపీ నాయ‌కులు స‌భ‌కు హాజ‌రు కానివ్వ‌కుండా అక్ర‌మంగా అరెస్ట్ చేయించార‌ని వైసీపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.