ఏపీకి మ‌రో షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-15 12:19:22

ఏపీకి మ‌రో షాక్

తెలుగుదేశం అధినేత ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ కాపులు ఇంకా మ‌రిచిపోలేదు... కాపుల‌ను బీసీల్లో చేర్చుతామని చంద్ర‌బాబు మేనిఫెస్టోలో చెప్ప‌డంతో, కాపులు అంద‌రూ ఒక్క‌టిగా తెలుగుదేశానికి ఓట్లు గుద్దారు.. అయితే ఈ ఓటు బ్యాంకు మొత్తం తెలుగుదేశానికి బ‌లంగా ప‌డ‌టంతో, కాపుల ఓట్లతో గ‌తంలో ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలో మెజార్టీ స్ధానాలు గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ.
 
అయితే ఇటు బీసీల నుంచి తీవ్ర వ్య‌త‌రేక‌త రావ‌డంత రాజ‌కీయంగా మ‌రింత ఎదురుదెబ్బ‌ల‌కు ఆస్కారం ఉండ‌టంతో ,బాబు ఈ నాలుగేళ్లుగా కాపుల రిజ‌ర్వేష‌న్ల హామీని ప‌క్క‌న పెట్టారు.. అయితే చివ‌ర‌కు జ‌గ‌న్ పాద‌యాత్ర ఎఫెక్ట్.. ముద్ర‌గ‌డ కాపుల‌తో చ‌ర్చించి కార్యాచ‌ర‌ణ ముందుకు తీసుకురావ‌డంతో, చంద్ర‌బాబు కూడా దీనిపై ఓ డెసిష‌న్ కు వ‌చ్చారు.. అసెంబ్లీలో దీనిపై ప్ర‌క‌ట‌న చేసి ముందుకు వెళ్లారు... అయితే త‌న చేతుల్లో ఇక కాపుల అంశం లేద‌ని కేంద్రానికి ఇది సంబంధం అని చేయిదులుపుకున్నారు చంద్ర‌బాబు... అయితే పార్ల‌మెంట్లో మాకు కాపు రిజ‌ర్వేష‌న్ల బిల్లు రాలేదు అని స‌మాధానం చెప్పింది కేంద్రం. త‌ర్వాత హడావిడిగా బిల్లు కేంద్ర హూంశాఖ‌కు చేరింది.
 
ఇక ఏపీ స‌ర్కారు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు కేంద్రంలో చ‌ట్ట రూపం తెచ్చుకోవ‌డానికి మ‌రింత ఆల‌స్యం అయ్యేలా ఉంది.. అలాగే అస‌లు చ‌ట్ట రూపం ఆగిపోయే ప‌రిస్దితి క‌నిపిస్తోంది. దీనికి ముఖ్య కార‌ణం కేంద్ర‌సిబ్బంది శిక్ష‌ణ వ్య‌వ‌హారాల శాఖ ఇందులో లోపాల‌ను చెబుతోంది. మొత్తం రిజ‌ర్వేషన్ల‌ను 50 శాతానికి మించ‌కూడ‌దు అని సుప్రీం కోర్టు తీర్పు నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం పై కేంద్రం వెన‌క‌డుగు వేస్తోంది అని తెలుస్తోంది.
 
దీనికి బ‌ల‌మైన కార‌ణాలు ఏమైనా ఉన్నాయా అనేది బిల్లులో రూపొందించాలి... అయితే ఏపీ స‌ర్కారు అటువంటి ప‌నిచేయ‌లేదు... దీంతో తెలుగుదేశం స‌ర్కారు మొక్కుబ‌డిగా ఈబిల్లును కేంద్రానికి పంపారు అని అంటున్నారు. అయితే ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్దితుల్లోకేంద్రంకూడా దీనిపై వెన‌క‌డుగు వేస్తొంది అని తెలుస్తోంది.
 
ఇక ఈ బిల్లు ప్రాసెస్ తెలిసిందే అన్ని శాఖల అభిప్రాయాలు తీసుకుంటారు.. త‌ర్వాత అందులో లోటు పాటుల‌ను సూచిస్తారు... ఇది మ‌ళ్లీ తిరిగి ఏపీ స‌ర్కారుకు పంపుతారు, మ‌ళ్లీ ఆ స‌వ‌ర‌ణ‌లు చేసి ఏపీ కేంద్రానికి పంపాలి.. అయితే ఈ ప్రాసెస్ సంవ‌త్స‌రంలో జ‌రిగేది కాదు, ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో బాబు ఇచ్చిన హామీ కాపుల‌కు నెర‌వేర‌దు అంటున్నారు.. వ‌చ్చే మేనిఫెస్టోలో మ‌రోసారి కాపుల అంశం ఉంటుంది అని అంటున్నారు. మ‌రి దీనిపై ముద్ర‌గ‌డ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.