ఆ విష‌యంలో మ‌ద‌న‌ప‌డుతున్న క‌ర‌ణం బ‌ల‌రాం ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-28 11:52:15

ఆ విష‌యంలో మ‌ద‌న‌ప‌డుతున్న క‌ర‌ణం బ‌ల‌రాం ?

సీఎం చంద్ర‌బాబు 40 ఏళ్ల రాజ‌కీయ చరిత్ర పై దేశంలో అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.. బ‌హుశా ప్ర‌పంచంలో ఇంత రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడు ఎవ‌రూ ఉండ‌రు అని తెలుగుత‌మ్ముళ్లు అనుకుంటున్నారు.. కాని ప‌క్క రాష్ట్రం లో ఉన్న క‌రుణానిధి, వెళ్లిపోయిన జ్యోతిబ‌సు లాంటి ఉద్దండులు చాలా మంది ఉన్నారు.. అయితే ఇది వారికి చెప్పినా అర్ధం కాని అంశం.
 
ఇక ప్ర‌పంచ‌బ్యాంకు నుంచి గ్రామీణ  బ్యాంకు వ‌ర‌కూ అంద‌రూ అధ్య‌క్షులు బాబు గారినే ఆద‌ర్శంగా తీసుకుంటారు. అనేది త‌మ్ముళ్ల వాద‌న‌.. ఐక్య‌రాజ్య‌స‌మితి నుంచి స‌హ‌కార స‌మితి వ‌ర‌కూ అందరూ బాబు విజ‌న్ నే ఆద‌ర్శంగా తీసుకుంటారు అంటారు అది వారి మ‌క్కువ‌.
 
అయితే 40 ఏళ్ల రాజ‌కీయ ఎక్స‌పీరియ‌న్స్ లో ఆయ‌న‌తో పాటు స‌రిస‌మానులు ఎవ‌రైనా ఉన్నారా అంటే, అక్క‌డ రాయ‌ల‌సీమ‌లో ఉన్న సీనియర్ నాయ‌కుడు ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి, అలాగే ప్ర‌కాశంలో ఉన్న క‌ర‌ణం బ‌ల‌రాం.. వీరు ఇరువురు కూడా 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటారు తెలుగుదేశం నేత‌లు.
 
అయితే ఈ 40 ఏళ్ల రాజ‌కీయం గురించి ఆయ‌న‌ను క‌దిలిస్తే త‌న‌కు ప‌ద‌వులు ముఖ్యం కాదు అన్నారు క‌ర‌ణం బ‌ల‌రాం.. అలాగే రాజ‌కీయాలు ఇప్పుడు డ‌బ్బుతో న‌డుస్తున్నాయి అని అన్నారు క‌ర‌ణం... చంద్ర‌బాబు తాను ఒకేసారి ఎమ్మెల్యేలుగా వ‌చ్చాము అని అన్నారు క‌ర‌ణం. ఇక జిల్లాలో సీనియ‌ర్ గా కూడా నాకు గుర్తింపు ఉంది అని అన్నారు.
 
ఇక ఫిరాయింపుల పై ఆయ‌న మాట్లాడుతూ ఫిరాయించిన వారిని వెన‌క‌వేసుకురావ‌డం మంచిది కాదు అని అన్నారు.. ఇక గ‌తంలో చంద్ర‌బాబు క‌ర‌ణం ఎమ్మెల్యేలుగా ఉన్న స‌మ‌యంలో ఇరువురు మంత్రి ప‌ద‌వుల కోసం చూశారు.. కాని చివ‌ర‌కు ఇరువురికి కాకుండా వేరేవారికి అక్క‌డ మంత్రిప‌ద‌వి ఇవ్వాలి అని సూచించారు. అయితే చంద్ర‌బాబు మాత్రం క‌ర‌ణంతో రాజీకుదిర్చారు అంటారు అందుకే పాపం క‌ర‌ణం వెన‌క‌డుగు  వేశారు అని అప్పుడు బాబు మంత్రి అయ్యారు ఆ వెంట‌నే ఎన్టీఆర్ కు అల్లుడయ్యారు, త‌ర్వాత సీఎం అయ్యారు అనేది సీనియ‌ర్ల‌కు తెలిసిన వాస్త‌వం.
 
ఇక ఇప్పుడు స‌రిస‌మానులుగా ఉన్న నాయ‌కులు  వీరు..అయినా క‌ర‌ణం పార్టీలు మారి అటు ఇటూ ఉండ‌టంతో క‌ర‌ణం ని కూడా చంద్ర‌బాబు న‌మ్మ‌లేదు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం కూడా ఆయ‌న‌కు జిల్లాలో కేడ‌ర్ దూరం అయింది.. అయితే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ప‌ద‌వి వ‌స్తుంది అని అనుకున్నారు.. కాని గొట్టిపాటి వ‌ర్గ‌పోరుతో ఇక్క‌డ కేవ‌లం ఎమ్మెల్సీ మాత్రమే ద‌క్కింది.. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అద్దంకి తెలుగుదేశం అభ్య‌ర్దిగా  గొట్టిపాటి ఫైన‌ల్ అయితే క‌ర‌ణం కుమారుడు వెంక‌టేష్ రాజ‌కీయం ప్ర‌శ్నార్ద‌క‌మే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.