టీడీపీకి ఎమ్మెల్సీ కరణం షాక్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

karanam balaram tdp
Updated:  2018-04-05 04:19:35

టీడీపీకి ఎమ్మెల్సీ కరణం షాక్ ?

అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షాలు అభివృద్ది జ‌రుగ‌డం లేదు అని విమ‌ర్శ‌లు చేయ‌డం అధికార పార్టీని దుమ్ముఎత్తి పోయ‌డం దుల‌ప‌డం చేయ‌డం చూస్తూ ఉంటాం... అయితే అన్నీ దారులు మూసుకుపోయి ఏపీలో తెలుగుదేశం పార్టీ మ‌ధ్య‌స్దంగా ఉండిపోయింది.... ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయ‌కులే అసెంబ్లీలో అభివృద్ది జ‌రుగ‌డం లేదు అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు అంతేకాదు ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌ల జోరు పెంచారు.
 
ఇక ప్ర‌పంచం అంతా ఏపీ వైపు చూస్తోంది అని అంటున్న చంద్ర‌బాబుకు తెలుగుదేశం నాయ‌కుల‌కే షాక్ ఇస్తున్నారు ఇటు ఏపీలో పెట్టుబడులు ల‌చ్చ‌ల కోట్లు వ‌స్తున్నాయి అని చెబుతున్న చంద్ర‌బాబు స‌ర్కారుకు తెలుగుదేశం నాయ‌కుల‌కే కౌంట‌ర్లు ఇస్తున్నారు.. అయితే తెలుగుదేశంలో క‌ర‌ణం బ‌ల‌రాంకు ప్ర‌కాశంలో ఫేం ఉంది... అయితే ఆయ‌న తాజాగా మండ‌లిలో చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీలో తెలుగుదేశానికి మంట పుట్టిస్తున్నాయి.
 
ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు గురించి  ఎమ్మెల్సీ  కరణం బలరాం ఓ ప్రశ్న వేశారు. అందుకు పరిశ్రమలశాఖ మంత్రి అమరనాధరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతానికి అటువంటి ప్రతిపాదనలేవీ లేవని సమాధానం ఇచ్చారు . దాంతో కరణం ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.
 
జిల్లాకు వచ్చిన పరిశ్రమలన్నింటినీ తిరుపతి, వైజాగ్, గన్నవరం ప్రాంతాలకు తీసుకెళుతుంటే దొనకొండకు పరిశ్రమలు ఎలా వస్తాయంటూ మండిపడ్డారు. దొనకొండ ప్రాంతంలోనే రాజధాని వస్తుందని జనాలు ఆశించారన్నారు. రాజధానిని అమరావతికి తరలించినా పరిశ్రమలన్నా వస్తే దొనకొండ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని అనుకుంటే చివరకు అదికూడా జరగటం లేదని ధ్వజమెత్తారు. దీంతో ఒక్క‌సారిగా అంద‌రూ కంగుతిన్నారు.
 
అస‌లు క‌ర‌ణం బ‌లంరాం ఇంత రేంజ్ లో ఫైర్ అవ‌డంతో ఒక్క‌సారిగా స‌భ‌లో అంద‌రూ షాక్ అయ్యారు... తెలుగుదేశం స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు అయినా  ఎటువంటి అభివృద్ది జ‌రుగ‌డం లేదు అని అన్నారు... నాలుగు సంవ‌త్స‌రాలు అయింది ప్ర‌జ‌లు అడిగితే నేను ఎటువంటి స‌మాధానం జిల్లా ప్ర‌జ‌ల‌కు చెప్పాలి అని అన్నారు ఆయ‌న‌. ఇక మంత్రి వెంట‌నే క‌చ్చితంగా అభివృద్ది చేస్తాం ప‌నులు ముందుకు తీసుకువెళ‌తాం అని తెలియ‌చేశారు.
 
ఇప్పుడు గొట్టిపాటి హావా న‌డుస్తోంది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం త‌ర‌పున త‌న కుమారుడు వెంక‌టేష్ కు సీటు ఇస్తారో లేదో అనేది డౌట్ గా ఉంది... ఈ స‌మ‌యంలో ఆయ‌న తెలుగుదేశం పై వ్య‌తిరేక‌త వ‌స్తున్న స‌మ‌యంలో ఆయ‌న సొంత పార్టీ పైనే ఇలా విమ‌ర్శ‌లు చేయ‌డం పై అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు... త్వ‌ర‌లో తెలుగుదేశానికి బిగ్ షాక్ ఇస్తారా అని కూడా ఆలోచిస్తున్నారు జిల్లా నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.