క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

karnataka assembly elections schedule
Updated:  2018-03-27 11:36:41

క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల

బీజేపీ హ‌వా దేశంలో కొన‌సాగుతోంది ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ కంచుకోట‌లకు బీట‌లు వాలుతున్నాయి అయితే ఇప్ప‌టికే సౌత్ రాష్ట్రాల‌పై మోదీ స‌ర్కారు ప‌ట్టుబిగుస్తోంద‌ని అదునుచూసి పొలిటిక‌ల్ పంజా విసురుతోంది అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి ఇప్ప‌టికే కామ్రేడ్ల‌తో కేర‌ళ‌లో అమితుమీగా ఉంది బీజేపీ ఇక త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కూడా చేయివేసి త‌న స‌త్తా చూపుదాము అనుకుంది చివ‌ర‌కు రాజ‌కీయంగా అడ్డుఅనుకునేవారిని ప‌క్క‌కు త‌ప్పించింది. 
 
అయితే ఇటు ఏపీకి ప్ర‌త్యేక హూదాని ప‌క్క‌న పెట్టింది అనే విమ‌ర్శ‌లువ‌స్తున్నాయి ఇటు తెలంగాణ‌లో పార్టీఎదుగుద‌ల కోసం కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారు రాజ‌కీయంగా ఎదుర్కొలేక అనేక ఆరోప‌ణ‌లు చేస‌తున్నారు అనే అప‌కీర్తిని మూట‌గ‌ట్టుకుంది
 
ఈ స‌మ‌యంలో క‌ర్నాట‌కలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.. ఈ ఏడాది క‌ర్నాట‌క‌లో ఎన్నిక‌లు జ‌రుగునున్న సంద‌ర్బంగా బ‌డ్జెట్ లో కూడా ఎక్కువ నిధులు కేటాయించిది ఇక క‌ర్నాట‌క ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసింది ఈసీ..   మే 12 న ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి.. అలాగే మే  18 న ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్నారు... ఇటు 4.98 కోట్ల మంది ఓట‌ర్లు ఉన్నారు క‌ర్నాట‌క‌లో....మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయ‌నున్నారు... 224 అసెంబ్లీ స్ధానాలు ఉన్నాయి.. క‌ర్నాట‌క‌లో 2,51,79,219 పురుష ఓట్లర్లు ఉండ‌గా, ఇక మ‌హిళా ఓటర్లు, 2,44,76,840 మంది ఉన్నారు.
 
ఈ ఏడాది  మే 28 తో క‌ర్నాట‌క అసెంబ్లీ కాలం ముగియ‌నుంది.అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీ పాట్ యంత్రాలు ఏర్పాటు. చేస్తున్నామ‌ని ఈసీ తెలియ‌చేసింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.