పోటీపై క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-09 19:09:45

పోటీపై క్లారిటీ

ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్రకు సంఘీ భావంగా సెగ్మెంట్ ల వారిగా వైసీపీ నాయ‌కులు ప్ర‌తీ ఇంటికి వెళ్లి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వారికి అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇస్తున్నారు. ఇక ఇప్ప‌టికే క‌ర్నూల్ జిల్లాలో వైసీపీ నాయ‌కులు బూత్ ల వారిగా కార్య‌క‌ర్త‌లు ఎలా ఉండాలో ప్ర‌తీ ఒక్క‌రికి శిక్ష‌ణా త‌ర‌గ‌తుల‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా కాటసాని రాంభూపాల్‌ రెడ్డి  వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య ఆధ్వ‌ర్యంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా రామ‌య్య మాట్లాడుతూ. 2019 సార్వ‌త్రికి ఎన్నిక‌ల్లో క‌ర్నూల్ జిల్లా త‌ర‌పున 14 అసెంబ్లీ స్థానాల‌ను గెలిపించి వైసీపీ అధినేత జ‌గ‌న్ కు కానుక‌గా ఇవ్వాల‌ని ఆయ‌న తెలిపారు. అయితే ఇందుకోసం వైసీపీ నాయ‌కులు, అభిమానులు, కార్య‌క‌ర్తలు ప్ర‌తీ ఒక్క‌రూ క‌ష్ట‌ప‌డాల‌ని రామ‌య్య సూచించారు.
 
విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయం చేయ‌డం ఈ రాష్ట్రంలో ఒక్క జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికే సాధ్యం అవుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అలాంటి వ్య‌క్తిని ముఖ్య‌మంత్రిని చేయ‌డం మ‌నంద‌రి బాధ్య‌త అని రామ‌య్య‌ అన్నారు. చంద్ర‌బాబు నాయుడులా  జ‌గ‌న్ రోజుకొక మాట మార్చే వ్య‌క్తి కాద‌ని ఏదైనా మాట ఇస్తే అది నెర‌వేర్చేంత వ‌ర‌కూ నిద్ర‌పోర‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అలాగే పాణ్యం నియోజ‌కవ‌ర్గానికి చెందిన కాట‌సాని రాంభూపాల్‌ రెడ్డి  వైసీపీలో చేర‌డంతో క‌ర్నూల్ జిల్లాలో పార్టీ మ‌రింత బలోపేతం అయిందని  బీవై రామయ్య అన్నారు.
 
ఇక‌ కాటసాని రాంభూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ, 2019 ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం త‌న వంతు కృషి చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి చేయ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని  పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. అయితే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మీరు పాణ్యం నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేస్తారా అని మీడియా అడ‌గ‌గా. ఇందుకు కాట‌సాని స‌మాధానం ఇస్తూ, తాను పోటీ చేయ‌డం చేయ‌క‌పోవ‌డం వైసీపీ అధిన‌తే జ‌గ‌న్ చేతుల్లో ఉంద‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.